ట్రబుల్ షూటర్ గా  చినరాజప్ప

0 8,583

రాజమండ్రి ముచ్చట్లు:

 

 

తెలుగుదేశం పార్టీలో చినరాజప్ప కీలకంగా మారబోతున్నారు. ఆయన పార్టీకి, అధినేతకు నమ్మకమైన నేతగా కొనసాగుతున్నారు. చినరాజప్ప గతంలో విపక్షంలో ఉన్నప్పుడు కూడా జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను చూశారు. సమర్థవంతంగా తన బాధ్యతలను నిర్వహించారు. అందుకే చినరాజప్పకు 2014 ఎన్నికల్లో చిన రాజప్పకు చంద్రబాబు ఏరికోరి పెద్దాపురం టిక్కెట్ ను ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు కీలకమైన హోంమంత్రి పదవిని ఇచ్చారు.చినరాజప్పది మెతక స్వభావం. నెమ్మదిగా ఉంటూనే పనిని చక్క బెడతారన్న పేరుంది. ఆయనను ముఖ్యమైన విషయాల్లో చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు. లోకేష్ తో కూడా మంచి సంబంధాలు కొనసాగించడం ఆయనకు ప్లస్ పాయింట్. 2019లో పెద్దాపురం నుంచి తిరిగి గెలిచిన చినరాజప్ప అధినాయకత్వానికి నమ్మిన బంటుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలిగిన సమయంలోనూ చంద్రబాబు చినరాజప్పను వినియోగించుకున్నారు.త్రీమెన్ కమిటీని నియమించినప్పటికీ అందులో చినరాజప్ప గోరంట్ల బుచ్చయ్య చౌదరిని బుజ్జగించడంలోనూ, రాజీనామా చేయకుండా నిరోధించడంలోనూ చినరాజప్ప కీలక భూమిక పోషించారు. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ దూకుడు ఎక్కువగా ఉంది. అక్కడ పార్టీ నేతల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య పార్టీని ఇబ్బంది పెడుతుంది.ఈ సమయంలో చినరాజప్ప సేవలను వినియోగించుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలను పరిష్కరించే బాధ్యతను చినరాజప్పకు అప్పగించనున్నారని తెలిసింది. చినరాజప్ప అయతే స్మూత్ గా డీల్ చేస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. అదే జిల్లాలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఉన్నప్పటికీ చినరాజప్పకు ప్రాధాన్యత ఇచ్చేందుకే చంద్రబాబు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Chinarajappa as a trouble shooter

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page