గాంధిజి ఆశయాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌ – ఎంపీ రెడ్డెప్ప

0 9,706

పుంగనూరు ముచ్చట్లు:

 

జాతిపిత మహాత్మగాంధి ఆశయాలను అమలు చేస్తూ గ్రామస్వరాజ్య పాలనకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నాందిపలికారని చిత్తూరు ఎంపి రెడ్డెప్ప తెలిపారు. శనివారం కమిషనర్‌ కెఎల్‌.వర్మ మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా కలసి ఏర్పాటు చేసిన గాంధి జయంతి కార్యక్రమంలో ఎంపి అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధి విగ్రహానికి ఎంపితో పాటు జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి కలసి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఎంపి మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజా సమస్యలు పూర్తిగా పరిష్కారమై, ప్రజల ముంగిట పాలన నిర్వహిస్తున్న ఘనత వైఎస్‌ఆర్‌సిపిదేనని కొనియాడారు. అలాగే పుదిపట్లలో గల అనాధాశ్రమంలో విశ్రాంత ఉద్యోగులు గాంధిజయంతిని నిర్వహించారు. పలుప్రాంతాలలో గాంధి జయంతిని నిర్వహించి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు నాగేంద్ర, సిఆర్‌.లలిత తో పాటు వైఎస్‌ఆర్‌సిపి నాయకులు జయరామిరెడ్డి, ఆవుల అమరేంద్ర, చంద్రారెడ్డి యాదవ్‌ , కౌన్సిలర్లు, మున్సిపల్‌కార్మికులు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: CM Jagan implementing Gandhiji’s ideals – MP Reddeppa

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page