విద్యార్ధి నేతలకే కాంగ్రెస్ టిక్కెట్

0 8,558

హైదరాబాద్ ముచ్చట్లు:

సుదీర్ఘ మంతనాల తర్వాత హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేసింది ఎన్‌ఎస్‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్‌  పేరును ఖరారు చేసిన రాష్ట్ర పార్టీ అధిష్ఠానం ఆమోదం కోసం పంపించింది. అభ్యర్థి ఎంపికపై శుక్రవారం జరిగిన చర్చలో పలువురి పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే టీఆర్‌ఎస్‌ తరఫున ఆ పార్టీ విద్యార్థి నాయకుడిని అభ్యర్థిగా నిలబెడుతున్న నేపథ్యంలో బల్మూరు వెంకట్‌ పేరును కాంగ్రెస్‌ ముఖ్యులు ప్రతిపాదించారు.రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా బల్మూరు వెంకట్‌ రెండు పర్యాయాలుగా పనిచేస్తున్నారు. వెంకట్‌ పేరును ప్రతిపాదించే ముందు పార్టీ ముఖ్యనేతలు ఆయన్ని పిలిచి అభిప్రాయం తీసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌, సీఎల్పీ నేత భట్టి, ప్రచార కమిటీ చైర్మన్‌ దామోదర్‌ రాజనర్సింహ తదితరులతో చర్చించిన అనంతరం వెంకట్ పేరును ఖరారు చేశారు. శనివారం టీపీసీసీ చేపట్టనున్న విద్యార్థి, నిరుద్యోగ సైరన్‌ సందర్భంగా వెంకట్‌ పేరును ప్రకటించే అవకాశాలున్నాయి.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Congress ticket for student leaders

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page