బతుకమ్మ చీరల పంపిణీ

0 8,767

హైదరాబాద్ ముచ్చట్లు:

దసరా పండుగ పురస్కరించుకుని ప్రభుత్వం మహిళలకు అందజేస్తున్న బతుకమ్మ కానుక చీరల ఎమ్మెల్యే దానం నాగేందర్ పంపిణీ చేశారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని  జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మేయర్ గద్వాల విజయలక్ష్మి తో  కలిసి పంపిణీ చేశారు. జూబ్లీహిల్స్లోని భగత్ సింగ్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ డివిజన్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ తో  చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వం తరఫున కలవాలని చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.  బతుకమ్మ చీరలు తీసుకుంటున్న ప్రతి మహిళ ఎంతో సంతోషంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వదించి వెళ్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Distribution of Batukamma saris

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page