కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

0 8,568

షాద్ నగర్ ముచ్చట్లు:

షాద్ నగర్ లో ఎమ్మెల్యే  వై.అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో 114 మందికి రూ. 1కోటి 14లక్షల 13వేల 224  కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేసారు. 126 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు రూ. 47 లక్షల 50వేల చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన ఆట్లాడుతూ.. ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతుందని వాటిని నిరుపేదలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఫరూక్ నగర్ మండల పరిషత్ కార్యాలయం లో 114 మందికి రూ. 1కోటి 14లక్షల 13వేల 224  కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. అదేవిధంగా 126 మంది లబ్ధిదారులకు 47 లక్షల 50వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు.  ఈ కార్యక్రమంలో  జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్,  ఆర్డీవో రాజేశ్వరి, జెడ్పిటిసిలు వెంకట్ రామ్ రెడ్డి, విశాల శ్రావణ్ రెడ్డి, ఎంపీపీ ఖాజా అహ్మద్ ఇద్రీస్,మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్,మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నే కవిత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వంకాయల నారాయణ రెడ్డి,ఎంపీటీసీ భార్గవ్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు సర్వర్ పాషా,ప్రతాప్ రెడ్డి(చింటూ ), శ్రీనివాస్,ఈశ్వర్ రాజు, బచ్చలి నర్సింహులు,జూపల్లి శంకర్,యుగేందర్,నందకిషోర్, మైనారిటీ నాయకులు ఆయా మండలాల,గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Distribution of Kalyana Lakshmi checks

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page