శేరిలింగంపల్లిలో చీరల పంపిణీ

0 8,572

శేరిలింగంపల్లి  ముచ్చట్లు:

పేద ప్రజలను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందు ఉంటుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పర్వదినంను పురస్కరించుకొని అక్టోబర్ 2 నుండి  తెలంగాణ ఆడపడుచులకు సారె గా అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి గా పాల్గొని చీరలు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ  మాట్లాడుతూ బతుకమ్మ పర్వదినం సందర్భంగా ఆడపడుచులకు  సారెగా ఉచితంగా చీరలను అందచేసిన  ముఖ్యమంత్రి  కేసీఆర్ కు,  మంత్రి  కేటీఆర్ కు  నియోజకవర్గ అడపడచుల తరుపున ప్రత్యేక కృతఘ్నతలు తెలియచేసారు.   తెలంగాణ రాష్ట్ర లోని మహిళలు ముఖ్యంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం మహిళల గౌరవార్థం  ఉచితం గా చీరల పంపిణి చేయడం జరిగింది అని ఈ బహుమతి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ  యొక్క చీరల పంపిణీకి  నియోజక వర్గం లో  పేద మహిళలకు అందించడం చాలా ఆనందం గా ఉంది అని ఆయన అన్నారు.
బతుకమ్మ పండుగా ద్వారా తెలంగాణ సంప్రదాయాన్ని చాటి  చూపిన ఘనత మన ప్రభుత్వం కే దక్కిందని  అని తెలియచేసారు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అర్హులైన మహిళలకు అందరికీ చీరలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.  పేదలని అన్ని  ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం  ముందు ఉంటుందని, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టడంలో తెలంగాణ ప్రభుత్వం ముందు ఉందని  ఆయన అన్నారు.

 

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Distribution of saris in Sherilingampally

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page