ఎట్టకేలకు  కాణిపాకం దేవస్థానం పాలకమండలి ఏర్పాటు

0 8,770

కాణిపాకం  ముచ్చట్లు:

ఎట్టకేలకు  స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం పాలకమండలి ఏర్పాటు అయింది. గత 3 సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్న కాణిపాకం ఆలయ పాలకమండలి ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వైసీపీ.ప్రభుత్వం ఏర్పడిన తరువాత కాణిపాకం ఆలయ పాలక మండలి ని ఏర్పాటు చేయాలని భావించి పలువురి పేర్లను ప్రభుత్వం పరిశీలించించి స్థానికులకు కాకుండా బయటి ప్రాంతాల వ్యక్తులను ఆలయ కమిటీ చైర్మన్ గా నియమించాలని భావించింది…కానీ కాణిపాకం ఆలయ ఉభయధారులుగా  రాజకీయాల కు అతీతంగా ఉభయదారులుగా ఉన్న 14  గ్రామాలకు చెందిన వ్యక్తులనే  పాలక మండలి అధ్యక్షుడిగా నియమించాలని ఒక్కతాటి పై  రావడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు…ఈ క్రమంలో నిన్నటితో కాణిపాకం ఆలయ వార్షికోత్సవాలు ముగియడంతో ప్రభుత్వం హఠాత్తుగా 13 మంది సభ్యులతో   పాలక మండలి ప్రకటించడంతో పాలకమండలి సభ్యులతో ఆలయ ఈఓ వెంకటేష్   ప్రమాణస్వీకారం చేయించారు. పాలక మండలి అధ్యక్షుడు గా కాణిపాకం ఆగరంపల్లి కి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు మోహన్ రెడ్డి ని ప్రభుత్వం నియమించింది..గతంలో మోహన్ రెడ్డి తండ్రి జగన్నాధ రెడ్డి కూడా ఆలయ పాలక మండలి అధ్యక్షులు గా పనిచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ కార్యక్రమానికి పరిసర గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Finally the Kanipakam temple governing body was formed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page