మహాత్మాగాందీ స్పూర్తితో తెలంగాణ తెచ్చిన యోదుడు కేసీఆర్

0 9,265

-రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణగా మార్చింది కేసీఆర్
-భారీ మెజార్టీతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయం

 

హుజూరాబాద్ ముచ్చట్లు:

 

- Advertisement -

హుజురాబాద్ లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది, హుజురాబాద్ టౌన్ కు చెందిన దళితవాడ, 12వ డివిజన్, బోర్నపల్లి, ఇందిరానగర్, బిసి కాలనీల్లో శనివారం ఉదయం మార్నింగ్ వాక్లో ప్రతీ ఒక్కరితో నేరుగా మాట్లాడారు మంత్రి గంగుల కమలాకర్. గాంధీజయంతి సందర్భంగా ఆ మహనీయున్ని స్మరించుకున్నారు, మహాత్మాగాందీ స్పూర్తితో తెలంగాణ ఉద్యమాన్ని నడిపి సాధించిన యోదుడు, ధళిత, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో ధైర్యం నింపిన దేవుడు కేసీఆర్ గారన్నారు, ఇక్కడి మహిళలు ఉధయం నుండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంపిన నాకోసం పనికిపోకుండా ఎదురుచూసి కడుపు నిండా దీవెనార్థులు పెట్టారన్నారు, ఏ రాజకీయ వేత్త వచ్చినా అదికావాలి, ఇదికావాలి అని కోరికలు కోరే ప్రజలు తొలిసారిగా బ్రహ్మండమైన స్వాగతం చెప్తూ కడుపునిండా దీవెనార్థులు పెడతున్నారన్నారు. ఇన్నేళ్లలో ఎన్నో ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు కేవలం ఓటు బాంకుగానే తమను చూసారని, కడుపునిండా బోజనం పెట్టలేదని తొలిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల మాకు ధైర్యం వచ్చిందని, మా పిల్లల్ని, కుటుంబాల్ని పోషించుకునే ధైర్యాన్ని ఇచ్చారని చెప్తున్నారన్నారు మంత్రి గంగుల. తెలంగాణ రావడం వల్లే ఈ భరోసా సాద్యమయిందన్నారు, బడుగు, బలహీన, దళిత వర్గాలు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు, దాని ఫలితమే రైతుబందు, రైతుబీమా, 24గంటల ఉచితకరెంటు,  కాళేశ్వరం నీళ్లు, పంటల దిగుబడులు, ధళితబందు వంటి పథకాలు వచ్చాయని, తద్వారా రైతుల ఆత్మహత్యలు ఆగాయన్నారు. ఒక బిసీ బిడ్డగా బడుగు, బలహీన, ధళిత వర్గాలు ఈ రోజు కేసీఆర్ పాలన వల్లనే సంతోషంగా ఉన్నామన్నారు. ఈ అభివ్రుద్ది, సంక్షేమాన్ని ఇచ్చే ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని స్వయంగా మహిళలే ప్రతీ ఓటరును పోలింగ్ బూత్ వరకూ తీసుకెళ్లి కేసీఆర్ కి మద్దతుగా గెల్లు శ్రీనివాస్ ను గెలిపించడానికి కారుగుర్తుపై ఓటేయిస్తామని మహిళలు చెబుతుండడం టీఆర్ఎస్ భారీ మెజార్టీకి నిదర్శనమన్నారు.  ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: KCR is the warrior who brought Telangana with the inspiration of Mahatma Gandhi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page