బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

0 8,590

జనగామ  ముచ్చట్లు:

జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో భారీ ఎత్తున హాజరైన మహిళలకు ప్రభుత్వం అందచేస్తున్న బతుకమ్మ చీరలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మహిళలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  పై పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు.  బతుకమ్మలతో, డప్పులు, మేళతాళాలతో సంప్రదాయ బద్దంగా ఎదురేగారు. మంత్రి బతుకమ్మ ను ఎత్తుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఈ రోజు బతుకమ్మ చీరలను అందుకుంటున్న నా నియోజకవర్గ, తెలంగాణ ఆడ బిడ్డలందరికీ శుభాకాంక్షలు! అందరికీ ముందుగానే సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, శుభాభివందనాలు! తెలంగాణ వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వమే ప్రజల పండుగలని నిర్వహిస్తున్నది. ఇంటికి పెద్దన్నలా… ఆడ బిడ్డలకు మేన మామలా బట్టలు పెట్టి పండుగ చేసే సిఎం ని గతంలో మనం చూడలేదు? ప్రభుత్వమే ప్రజలకు బట్టలు పెట్టి పండుగని చేయడం చరిత్రలో ఎక్కడా లేదు. రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ వంటి పండుగలకు సిఎం బట్టలు పెట్టే ఆనవాయితీని కొనసాగిస్తున్నరు. సిఎం కెసిఆర్ అభివృద్ధి-సంక్షేమ పథకాలతో ప్రజలకు నిత్యం పండుగలా చేసిండ్రు.  సిఎం కెసిఆర్ గారు 2017లోనే బతుకమ్మ పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటించినారు.

- Advertisement -

నేత పని వారికి చేతినిండా పని కల్పించడంతోపాటు, తెలంగాణ మహిళలను గౌరవించుకోవాలని సిఎం కెసిఆర్ గారు ఒక బహుమతిగా చీరలను పంపిణీ చేస్తున్నారు. రేషన్ కార్డు ఉన్న, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు చీరలు పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఏడాది రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా మహిళలకు చీరలు అందిస్తున్నం. రాష్ట్రంలో 20లక్షల, 36వేల, 234 కుటుంబాలకు ఈ చీరలు అందుతున్నయి. 2017లో… 95 లక్షల 48 వేల 439 మహిళలకు చీరెలు అందించాం. 2018 లో… 96 లక్షల 70 వేల 474 మహిళలకు చీరెలు అందించాం. 2019 లో… 96 లక్షల 57 వేల 813 మహిళలకు చీరెలు అందించాం. 2020 లో… 96 లక్షల 24 వేల 384 మహిళలకు చీరెలు అందించాం.  ఈ ఏడాది 333 కోట్ల 14 లక్షలతో 1 కోటి 8 లక్షల చీరలను కానుకగా అందచేస్తున్నం. కోటి చీరలు సాధారణ మహిళలకు, 8 లక్షల చీరలు వయోవృద్ధ మహిళలకు ప్రత్యేకంగా తయారు చేసిన చీరలు అందచేస్తున్నం. 2019లో  313 కోట్లు ఖర్చు చేస్తే, 2020లో 317 కోట్లు ఖర్చు చేయగా, ఈ ఏడాది 333 కోట్లు ఖర్చు చేస్తున్నం. గత ఏడాది  287 రకాల చీరలు అందిస్తే, ఈసారి 30 సరికొత్త డిజైన్లు, 20 విభిన్న రంగుల తో మొత్తం 810 రకాల చీరలను అందుబాటులోకి తెచ్చాం. గత ఏడాది 317 కోట్లు ఖర్చు చేస్తే, ఈ ఏడాది 333 కోట్లు ఖర్చు చేస్తున్నం. ఈ చీరలన్నీ జరీ అంచులతో 100% పాలిస్టర్ ఫిలిమెంట్ / నూలు తో తయారు చేయబడ్డాయి. అన్ని వయసుల మహిళలు కట్టుకోవడానికి అనువైన విధంగా 6 న్నర మీటర్లు, 9 మీటర్ల పొడవు గల చీరలు ఇవి. మెప్మా, సెర్ప్ మహిళా సంఘాల సభ్యుల సలహా మేరకు ప్రముఖ డిజైనర్లతో డిజైన్లు చేయించాం. ఈ సంవత్సరం కూడా సిరిసిల్ల కరీంనగర్, వరంగల్ జిల్లాలోని 373 మాక్స్ సంఘాలు / ఎస్.ఎస్.ఐ యూనిట్లలో ఢాబీ/జకార్డు బిగించబడిన పవర్లూమ్స్ పైన ఈ చీరలు తయారు చేశారు. బతుకమ్మ చీరలతో పవర్ లూమ్స్ లో పని చేసే కార్మికులకు వేతనాలు బాగా పెరిగాయి. వారి కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి. బంగారు, వెండి, జరీ అంచులతో, మంచి డిజైన్ల కొంగులతో మంచి మంచి బతుకమ్మ చీరలు ఉన్నయి. మహిళలంతా ఈ చీరలు కట్టుకుని బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 46 కోట్ల 96 లక్షల 76 వేల రూపాయల విలువైన 13 లక్షల, 45 వేల 15 చీరలను పంపిణీ చేస్తున్నం. జనగామ జిల్లాలో 8 కోట్ల 48 లక్షల 11 వేల రూపాయల విలువైన 2 లక్షల (1 లక్షా  99 వేల 556 చీరలు) చీరలు మహిళలకు అందచేస్తున్నం. పాలకుర్తి నియోజకవర్గంలో 3 కోట్ల 38 లక్షల 58 వేల రూపాయల విలువైన 97 వేల 573 చీరలను అందిస్తున్నం. దేవరుప్పుల మండలంలో రూ. 54,39,225 ల విలువచేసే 15,675 చీరలు, పాలకుర్తి మండలంలో రూ. 70,52,775 ల విలువచేసే 20,325 చీరలు.  కొడకండ్ల మండలంలో రూ. 40,38,039ల విలువచేసే 11,637 చీరలు, పెద్ద వంగర మండలంలో రూ. 35,93,532 ల విలువచేసే 10,356 చీరల ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Minister Errabelli distributing Batukamma sarees

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page