లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి

0 9,866

హైదరాబాద్ ముచ్చట్లు:

 

భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  ఘనంగా పుష్పాంజలి ఘటించారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారికి పుష్పాంజలి. నిజాయితీకి, నిరాడంబరతకు లాల్ బహదూర్ శాస్త్రీ నిలువుటద్దం. తన జీవితాంతం అత్యంత సాదాసీదాగా గడిపిన మహనీయుడు. జై జవాన్…జై కిసాన్… నినాదంతో దేశానికి సైనికులు, రైతులు ఎంత ముఖ్యమో చెప్పారు. మంత్రిగా, ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి అనేక సంస్కరణలు చేపట్టారు. వారు ప్రధానిగా దేశానికి అనేక సేవలు చేశారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మరోసారి వారికి పుష్పాంజలి ఘటిస్తున్నానని మంత్రి అన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Minister Errabelli pays tribute to Lal Bahadur Shastri

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page