వికారాబాద్ లో మంత్రి సబిత పర్యటన

0 8,763

వికారాబాద్ ముచ్చట్లు:

వికారాబాద్ జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు.  మహాత్మా గాంధీ ,లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడులలో పాల్గొని మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. వికారాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ పార్క్ లో ఏర్పాటు చేసిన గాంధీ జయంతి వేడుకలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని మహాత్మ గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి   చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మున్సిపాలిటీ లో ఉత్తమ సేవలు అందిస్తున్న మున్సిపల్ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.  అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ పండుగ కు గుర్తింపు వచ్చిందన్నారు.  బతుకమ్మ పండుగ గీనిస్ బుక్ లో నమోదు అయిందంటే  ఆ ఘనత  ముఖ్యమంత్రి కేసీఆర్ , ఎమ్మెల్సీ  కవితకు దక్కుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని మతాల పండగలకు మన రాష్ట్రంలో బతుకమ్మ , క్రిస్టమస్, రంజాన్, పండగలకు  మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ,చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, వికారాబాద్ ఎమ్మెల్యే  డాక్టర్ మెతుకు అనంద్ , వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ , ఏఏంసీ  చైర్మన్ ముద్ద దీప భక్తవత్సలం , అడిషనల్ కలెక్టర్లు పలువురు ప్రజా ప్రతినిధులు కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Minister Sabita’s visit to Vikarabad

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page