ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలి- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

0 8,564

హైదరాబాద్ ముచ్చట్లు:

ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.  శనివారం నాడు సనత్ నగర్ లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో బతుకమ్మ చీరలను మంత్రి పంపిణీ చేసారు. మంత్రి మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు మరింత గుర్తింపు వుంది. తెలంగాణ పండుగ బతుకమ్మ ప్రపంచ పండుగ గా మారింది. మహిళలు బతుకమ్మను గొప్పగా జరుపుకోవాలనే ఆలోచనతో  బతుకమ్మ కు చీరలను పంపిణీ చేస్తున్నాం. ఈ సంవత్సరం కోటి 8 లక్షల చీరల పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సనత్నగర్ కార్పొరేటర్ లక్ష్మీ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు బాల్రెడ్డి, సంతోష్, సలీం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:People should celebrate festivals happily- Minister Talsani Srinivas Yadav

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page