పోలీసులకు రేవంత్ వార్నింగ్

0 8,566

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ కనబడుతోంది. దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా పేరుతో పలు ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభలు విజయవంతమయ్యాయి. తాజాగా, గాంధీ జయంతిని పురస్కరించుకుని నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో నిరసన ర్యాలీకి టీపీసీసీ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో నిరసన కార్యక్రమంపై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాత్ముడి జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో బాపూజీకి నివాళులర్పించిన అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు.తెలంగాణలో నిరుద్యోగ జంగ్‌ సైరన్ పేరుతో కాంగ్రెస్‌ చేపడుతున్న నిరసన ర్యాలీలో లాఠీ తగిలినా.. తూటా తగిలినా ముందు తనకే తగులుతుందని తెలిపారు. ‘గాంధీ జయంతి వేళ శాంతియుత నిరసనలు చేపడుతున్నాం.. విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌కు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలి. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీ నగర్‌ వరకు పాదయాత్ర నిర్వహిస్తాం.. జంగ్‌ సైరన్‌ ర్యాలీ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు సహకరించాలి. అత్యుత్సాహం ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలుంటాయి.పోలీసులు అడ్డుకుంటే నేనే ముందుంటా.. కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా జరిగే కార్యక్రమాలను రెచ్చగొట్టొద్దు’’ అని రేవంత్‌ సూచాయగా పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’ పేరిట కాంగ్రెస్‌ పార్టీ చేపట్టనున్న నిరసన కార్యక్రమాలు శనివారం నుంచి మొదలు కానున్నాయి. గాంధీ జయంతి నుంచి తెలంగాణ రాష్ట్రం సాకారమైన డిసెంబరు 9 వరకు 67 రోజుల పాటు విద్యార్థి, నిరుద్యోగుల పక్షాన సర్కార్పై సమరానికి సిద్ధమైనట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి..

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Rewanth warning to police

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page