న్యాయం చేయాలంటూ రోడ్డెక్కి హంగామా

0 7,569

హైదరాబాద్  ముచ్చట్లు:

తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ నడిరోడ్డుపై హల్‌చల్ చేసింది. అడ్డొచ్చిన మహిళా కానిస్టేబుల్ జట్టుపట్టుకుని గోడకేసి కొట్టి.. కాలితో తన్ని వీరంగమేసింది. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని బహదూర్‌పురాకి చెందిన మహిళ తన భర్తపై పోలీస్ స్టేషన్‌‌‌లో ఫిర్యాదు చేసింది. స్టేషన్‌కి వచ్చిన ఆమె తనకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కి హంగామా సృష్టించింది. వాహనాలతో రద్దీగా ఉన్న రోడ్డు మధ్యలోకి వెళ్లి నిల్చుని తనకు న్యాయం చేయాలంటూ హల్‌చల్ చేసింది.వాహనాలకు అడ్డుగా నిల్చుని గొడవ చేస్తుండడంతో మహిళా కానిస్టేబుళ్లు ఆమెను పట్టుకుని పక్కకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమెను గట్టిగా పట్టుకుని బలవంతంగా రోడ్డు పక్కకి లాక్కొస్తుండగా ఆమె కానిస్టేబుళ్లపై ఎదురుదాడికి దిగింది. మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టుకుని ఈడ్చి గోడకేసి కొట్టింది. కాలితో తన్నుతూ దూషణలకు దిగింది. మహిళ వీరంగం వేస్తున్న వీడియోలు కొందరు యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చర్చనీయాంశమయ్యాయి. మహిళా కానిస్టేబుళ్లపై దాడి చేస్తున్న వీడియో వైరలవుతోంది.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Roddeck commotion to do justice

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page