జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళి -సర్పంచ్ నారాయణరెడ్డి

0 8,905

పుంగనూరు ముచ్చట్లు:

జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని నెక్కొంది గ్రామ సచివాలయం వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు.సర్పంచ్ నారాయణరెడ్డి   ,సెక్రటరీ బసవరాజు   ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రప టానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతో , లోక్ సభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలవాలని కోరారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి గాంధీ తో పాటు పలువురు నాయకులు చేసిన ఉద్యమాలను గురించి ప్రజలకు వివరించారు. సర్పంచ్ మాట్లాడుతూ బాపూజీ కలలు కన్న గ్రామ గ్రామ స్వరాజ్యం అందరం కలిసికట్టుగా విధులు నిర్వహించి గాంధీజీ కలలను సాకారం చేయాలని సూచించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  యంపిటీసి భాస్కర్ , వెంకటరమణ ,గ్రామ సచివాలయం సిబ్బంది,  గ్రామ పంచాయతీ వాలంటీర్లు, గ్రీన్ అంబాసిడర్స్, గ్రామప్రజలు పాల్గొన్నారు .

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Solid tribute to the patriarch Mahatma Gandhi – Sarpanch Narayana Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page