సత్యం, అహింస, నీతి, నిజాయితీ జన్మదిన శుభాకాంక్షలు

0 9,705

-గాంధీ పూర్తి పేరు మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ.

 

అమరావతి ముచ్చట్లు:

 

- Advertisement -

మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తుల్లో గాంధీ ఒకరు. ప్రపంచానికి ఆయన కొత్త ఆయుధాలను ఇచ్చారు అదే అహింస సిద్దాంతం ఈనాడు ప్రపంచానికి పాఠమైందని న్యాయవాది ఎస్.ఆర్.ఆంజనేయులు పేర్కొన్నారు.దండయాత్రలతో కొట్టుకుచస్తున్న ప్రపంచానికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన మహానుభావుడు గాంధీజీ. ఆ అస్త్రాలను పరిచయం చేయడమే కాదు, వాటిని వాడటానికి కూడా ఎంతో ధైర్యం కావాలని నిరూపించారు. చేత కర్రబట్టి బ్రిటీష్ వారిని తరిమి కొట్టినా, మగ్గం చేతబట్టి నూలు వడికినా, చీపురు అందుకొని మురికివాడలు శుభ్రం చేసినా అదే ఒడుపూ, అంతే శ్రద్ధ. ఒక్కడుగా మొదలై కోట్లాది మందిని ప్రభావితం చేసి.. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. తెల్ల దొరలకు పడమర దారి చూపించారు. ‘‘ఇలాంటి ఓ వ్యక్తి ఈ భూప్రపంచం మీద రక్తమాంసాలు గల శరీరంతో మనుగడ సాగించారంటే ముందు తరాల వారు నమ్మలేకపోవచ్చు..’’మహాత్మా గాంధీని ఉద్దేశించి ప్రఖ్యాత వైజ్ఞానిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ అన్న మాటలివి. గాంధీజీ జీవితం గురించి చదివినవారికి, గాంధీయిజాన్ని అర్థం చేసుకున్న వారికి ఈ మాటలు అతిశయోక్తిగా అనిపించవు. ఇలాంటి వ్యక్తి ఈ భూ మండలం మీద మళ్లీ పుడతారా..?

 

 

 

 

సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నట్లు.. కొంత మంది ఇంటి పేరో, ఊరికొక వీధి పేరో కాదు ‘గాంధీ’. కరెన్సీ నోట్ల మీద, నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ అంతకన్నా కాదు..‘భరత మాత తల రాతను మార్చిన విధాత గాంధీ.. తరతరాల యమ యాతన తీర్చిన వరదాత గాంధీ..’
గాంధీజీ చరిత్ర అపురూపం.. సిరివెన్నెల మాటల్లోనే చెప్పాలంటే.. కర్మ యోగమే జన్మంతా.. ధర్మ క్షేత్రమే బ్రతుకంత. సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి, తూరుపు తెలరని నడిరాత్రికి స్వేచ్ఛా బాణుడి ప్రభాత కాంతి. పదవులు కోరని పావనమూర్తి.. హృదయాలేలిన చక్రవర్తి.

 

గాంధీజీ బాల్యం, జీవిత విశేషాలు

గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. గుజరాత్ రాష్ట్రంలో కథియవాడ్ జిల్లా పోరు బందర్ గ్రామంలో 1869 అక్టోబర్ 2న కరంచంద్ గాంధీ, పుత్లీ బాయి దంపతులకు ఆయన జన్మించారు. గాంధీజీ తండ్రి పోరు బందర్ సంస్థానంలో ఒక దివాన్‌గా పని చేసేవారు. తల్లి హిందూ సంప్రదాయాలను పాటించే వ్యక్తి.ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతోనే మొదలవ్వాలి. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించి పోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది. తృప్తి అనేది ప్రయత్నంలో తప్ప విజయం ద్వారా లభించదు. పూర్తి ప్రయత్నమే సంపూర్ణ విజయం.
గాంధీజీదేశాన్నంతటినీ ఏకదాటిపైకి తెచ్చి స్వాతంత్య్రం సంపాదించి పెట్టడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారు. దేశంపై చెరగని ముద్ర వేశారు. జాతిపిత అయ్యారు. అలాంటి మహాత్ముడు 1948 జనవరి 30న అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ రోజు సాయంత్రం ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనా మందిరానికి వెళ్తుండగా ఆయణ్ని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. విశ్వాన్ని ప్రభావితం చేసిన ఓ మహా ప్రాణం.. ‘హే రామ్’ అంటూ అలా అనంత వాయువుల్లో కలిసిపోయింది.ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన బాపూజీ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పట్టుదలగా నిలబడి, ఆచరించి భారత దేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే తనదైన ముద్ర వేశారు. మహోన్నత వ్యక్తిగా అవతరించారు. బాపూజీ చూపిన సత్యం, అహింసా మార్గాలు భావితరాలకు బంగారు బాటగా నిలిచాయి. మహాత్ముడి జన్మదినమైన అక్టోబర్ 2ను ఐక్యరాజ్య సమితి ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’గా ప్రకటించింది. భారతీయులకు ఇదెంతో గర్వ కారణం.

లాల్ బహదూర్శా శాస్త్రి

అక్టోబరు 2 అంటే మహాత్మ గాంధీ గారి పుట్టినరోజుగా మాత్రమే అందరూ గుర్తు పెట్టుకుంటారు. కానీ అదే రోజు భరతమాత కన్న మరో మహా నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు. ఏది ఏమైనా, మనం మరుపురాని రోజుగా గాంధీ జయంతిని పండుగగా జరుపుకునే అక్టోబర్ 2న మన దేశానికి మూడవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కూడా. నెహ్రూ మరణం తర్వాత గుల్జారీలాల్ నందా తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి భారత మూడో ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టారు.దేశం కోసం ప్రాణాలు విడిచిన లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబర్ 2 ఉత్తర ప్రదేశ్‌లోని మొగల్ సరాయ్ గ్రామంలో శారదా ప్రసాద్ రాయ్, రామ్ దులారీ దేవీలకు జన్మించారు.కాకిలా కలకాలం జీవించే కంటే హంసలా కొద్ది కాలం జీవించారు శాస్త్రిగారు. ప్రధానిగా కొంతకాలమే ఉన్న భారతీయ యవనికపై లాల్ బహుదూర్ శాస్త్రి తనదైన ముద్ర వేశారు. అదే ఆయన్ని ధృడమైన నాయకునిగా మన ముందు నిలబెట్టాయి. 1965 భారత్-పాకిస్థాన్ యుద్ధం సందర్భంగా ఆయన ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, సంకల్పం, దీక్షా దక్షతలను ఎంత చెప్పుకున్నా తక్కువే.
ముఖ్యంగా దేశానికి వెన్నుముకలైన రైతులను, సైనికులను ఉద్దేశించి ఆయన చేసిన నినాదం ‘జై జవాన్..జై కిసాన్’ దేశాన్ని ఒక్కటి చేసింది. పాకిస్థాన్‌పై విజయాన్ని సాధించిన ఆనందాన్ని దేశ ప్రజలతో పంచుకునే లోపే 1966 జనవరి 10న పాకిస్థాన్‌తో తాష్కెంట్‌(ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్)లో ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో యుద్ధ విరమణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆ మర్నాడే జనవరి 11న ఆయన

 

 

 

 

ఓ దేశాధినేత అదీ మరో దేశానికి అతిథిగా ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు వెళ్లి అక్కడే అసహజ, అనుమానాస్పద రీతిలో మృతి చెందటం చరిత్రలో అంతకు ముందెన్నడు లేదు. ఆ తర్వాత ఎప్పుడూ లేదు. ఐనా ఇంత వరకు శాస్త్రి మరణంపై పూర్తి స్థాయి సమగ్ర దర్యాప్తు జరగలేదు. జరిగినా వాటి ఫలితాలు వెల్లడికాలేదు. ఆఖరకు వాటికి సంబంధించిన పత్రాలు ఇప్పుడు అందుబాటులో లేవుమొత్తానికి భారతదేశ రాజకీయాల్లో ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా నీతి, నిజాయితీ, నిరాడంబరత, వ్యక్తిత్వం, త్యాగశీలతే శాస్త్రీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ఆయన చనిపోయిన తర్వాత భారత ప్రభుత్వం ఆయన్ని భారతరత్నతో గౌరవించాయి. చనిపోయిన తర్వాత ఈ బిరుదు అందుకున్న తొట్ట తొలి నాయకుడిగా లాల్ బహదూర్ శాస్త్రి చరిత్రలో నిలిచిపోయారు. మొత్తానికి భారతదేశ యవనికపై లాల్ బహుదూర్ శాస్త్రిది ప్రత్యేక సంతకం అనే చెప్పాలి.మనలో చాలామందికి తెలియని పేరు, నక్కల్లాంటి, మేకవన్నెపులుల్లాంటి కొందరు నాయకులు చేసుకునే ప్రచారాలను మాత్రమే నిజమనీ, అదే చరిత్ర అని నమ్మే గొర్రెల్లాంటి ప్రజలు మరచిపోయిన పేరు, చరిత్రకారులు సైతం నిర్లక్ష్యం చేసిన పేరు, తన జీవితాన్ని దేశం కోసం అర్పించిన ఒక నిజమైన దేశభక్తుడి పేరు, ప్రధానిగా పని చేసి కూడా కనీసం స్వంత ఇల్లు కూడా ఏర్పరుచుకోలేని నిజాయితీపరుడి పేరు, నిస్వార్ధ ప్రజా నాయకుడి పేరు, పాకిస్తాన్ ను గడగడలాడించి వెన్నులోంచి వణుకు పుట్టించిన పేరు,

 

 

 

 

యుద్దరంగంలో పాకిస్తాన్ కు చెమటలు పట్టించి ప్రాణభయంతో పరుగులు పెట్టించి భారతదేశపు సత్తా చాటిన భారత ప్రధాని పేరు, తన తెగువతో ధైర్యంతో పాకిస్తాన్ ను పాదాక్రాంతం చేసుకుని తన ధీరత్వాన్నీ వీరత్వాన్నీ చాటిన భారతనాయకుడి పేరు. పబ్లిసిటీ లేని నాయకుడు కాబట్టి మనమంతా మరచిపోయిన పేరు. సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ ప్రధానీ, దేశం గర్వించదగ్గ నాయకుడు, జై జవాన్ జై కిసాన్ అంటూ నిస్వార్ధంగా నిరాడంబరంగా ప్రజాసేవలో తరించిన ఆదర్శప్రాయుడు, ప్రపంచదేశాల ముందు దేశగౌరవాన్ని నిలిపి, దేశం జీవించి దేశం కోసమే మరణించిన భారతరత్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి నేడుఅసలు లాల్ బహదూర్ శాస్త్రి చరిత్ర ఎంతమందికి తెలుసు ? ఆయనది సహజ మరణం కాదనీ ఆయన పొరుగు దేశానికి వెళ్ళి అక్కడ విషప్రయోగానికి గురై చనిపోయాడని ఎంతమందికి తెలుసు ? తమ ఉనికిని కోల్పోతామనే భయంతో పాకిస్తాన్, సోవియట్ యూనియన్ లు చేసిన కుట్ర.కు బలైపోయాడని ఎంతమందికి తెలుసు? శక్తివంతమైన నేతగా ఎదుగుతున్న లాల్ బహదూర్ శాస్త్రిని స్వంత పార్టీ (కాంగ్రేస్) నాయకులే అడ్డుతొలగించుకోవాలని చూసారనీ, ఆయన మరణానికి సంతోషించి ఇతర దేశాలతో కుమ్మక్కై ఆయన మరణ రహస్యాన్ని బయటకు పొక్కకుండా కాపు కాసారని ఎంతమందికి తెలుసు ?

 

 

 

ఆయన శవానికి కనీసం పోస్ట్ మార్టం కూడా జరగలేదని మీకు తెలుసా? ఆరోజు ఆయనతో ఉన్న వారంతా తరువాత హత్య చేయబడ్డారని, హత్యా ప్రయత్నాలకు గురయ్యారని మీకు తెలుసా ? అప్పటి మన ప్రభుత్వం లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి ఏమాత్రం స్పందించలేదనీ, ఆయన హత్య చేయబడ్డారన్న ఆరోపణలను కొట్టి పారేసాయనీ, ఇతర దేశాలతో సంబంధాలు దెబ్బ తింటాయనీ, కొందరి కుట్రలు బయటికొస్తాయనే కారణంతో మన ప్రభుత్వం కనీస విచారణ కూడా చేయలేదనీ న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు.గాంధీజీ సత్యం అహింస సిద్దాంతాలు ప్రపంచానికి పరిచయం చేస్తే లాల్ బహదూర్శా శాస్త్రి నీతి నిజాయితీ నిలువెత్తు చాటిన నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయారు. మహా నాయకులు మనదేశంలో పుట్టడం మన అదృష్టం అని న్యాయవాది ఎస్.ఆర్.ఆంజనేయులు పేర్కొన్నారు.

 

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Truth, non-violence, justice, honest birthday wishes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page