గ్రామ స్వరాజ్యమే సీఎం జగన్ ధ్యేయం- సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

0 8,614

రామసముద్రం ముచ్చట్లు:

గ్రామ స్వరాజ్యమే సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. శనివారం స్థానిక సచివాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్యం రావాలని కలలు కన్నారన్నారు. మన ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆయన కలలను సాకారం చేస్తూ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి పాలన సాగిస్తున్నారని ఆయన కొనియాడారు. 2వేల కుటుంబాలకు ఒక సచివాలయం ఏర్పాటు చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేస్తూ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు, కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి బాటలోనే స్థానిక శాసనసభ్యులు నవాజ్ బాషా కూడా పయనిస్తున్నారన్నారు. ప్రతినిత్యం నియోజకవర్గ సమస్యలపై అధికారులతో సమీక్షిస్తూ గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. అనంతరం సచివాలయ ఆవరణంలో జీవన్ మిషన్, జాతీయ ఉపాధిహామీ పథకం గ్రామసభలు నిర్వహించారు. ఉపాధిహామీ పథకం ద్వారా పనులు కావాలని అడిగిన వారికి 15 రోజుల్లో పనులు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, సచివాలయ సిబ్బంది మూర్తి, ఉపేంద్ర, రవికుమార్, బత్తెమ్మ, గౌతమి, రేణుక, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటరమణ, విఆర్ఏ మహమ్మద్ రఫీ, స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, మునస్వామి, జయచంద్ర, నాగరాజ, వాలింటర్లు మేఘన, రేవతి, రెడ్డెమ్మ, శ్రావణి, పుష్పావతి, దినకర్, వెంకటరమణ, కుమారస్వామి, ప్రదీప్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Village self-government is the goal of CM Jagan- Sarpanch Srinivasureddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page