బండి సంజయ్ యాత్ర ఉద్దేశ్యం ఏంటీ

0 7,861

సిరిసిల్ల ముచ్చట్లు:

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శనివారం వేములవాడకు వచ్చారు. కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నివాసం లో మీడియాతో మాట్లాడారు. పొన్నం మాట్లాడుతూ ప్రజా సంగ్రామ యాత్ర ఉద్దేశ్యం ఏంటో అంటూ బండి సంజయ్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఢిల్లీకి పోవడానికే మీ పాదయాత్ర ఉపయోగపడుతుంది. సీఎం కేసీఆర్ ను జైలుకు పంపిస్తాం. బీజేపి, టిఆర్ఎస్ లు  దొందు ఢిల్లీలో దోస్తు, గల్లీలో లొల్లి. మీ పాదయాత్ర లో సెల్ఫీ లకె పరిమితం. ఎన్నికయి రెండు ఏళ్ళు గడిచింది ఇప్పటివరకు ఎం అభివృద్ధి చేశారు. మీ పాదయాత్ర వల్ల ఏమైనా మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలు వస్థాయి. కేంద్రం ను మీరు ఇప్పటివరకు కరీంనగర్ నియోజకవర్గం కి ఎం నిధులు తెచ్చారు. పత్రికల వార్తలకు తప్ప మీ మాటలు దేనికి ఉపయోగ పడదు. కరోనా, వరదలు, ప్రజల సమస్యల పై మాత్రం మాట్లాడడాం లేదు. కేసీఆర్ తొత్తు బండి సంజయ్ అని విమర్శించారు.  కాకపోతే మీ కేంద్రం నుండి సీఎం కేసీఆర్ పై విచారణ జరిపించు అని అన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:What is the purpose of Bundy Sanjay Yatra?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page