భర్త ఉండగానే వితంతు ఫించన్

0 8,899

హైదరాబాద్  ముచ్చట్లు:

భర్తకి ఏమైనా జరిగితే తట్టుకోలేని భార్యలున్న ఈ దేశంలో బతికున్న భర్తని చంపేసిన మహా ఇల్లాలి ఉదంతమొకటి వెలుగుచూసింది. ఆమె భర్త ఇంట్లోనే ఉంటాడు కానీ రికార్డుల్లో మాత్రం ఉండడు. నిక్షేపంలా తిరుగుతున్న భర్తని నిలువునా చంపేసింది. పైసల కోసం కక్కుర్తి పడి మాంగళ్య బంధాన్ని మంటగలిపింది. పింఛను డబ్బుల కోసం బతికున్న భర్తని అంతం చేసేసింది. ప్రభుత్వ అధికారులు కూడా కనీసం విచారణ జరపకుండానే 26 ఏళ్ల మహిళకు పింఛను మంజూరు చేశారు. మూడేళ్లుగా జరుగుతున్న ఈ తంతు ఆలస్యంగా వెలుగుచూసింది.హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట ఏరియా ధరణీ నగర్‌‌కి చెందిన దివ్య(26) పింఛన్ డబ్బుల కోసం కక్కుర్తి పడి దారుణానికి ఒడిగట్టింది. కట్టుకున్న భర్త సుభాష్(37) బతికున్నా చంపేసింది. పింఛన్ పైసలికిచ్చిన విలువ తాళి కట్టిన భర్తకి ఇవ్వలేదు. తన భర్త చనిపోయాడని నమ్మించి వితంతు పింఛన్ తీసుకుంటోంది. ఇటీవల కుటుంబంలో గొడవలు జరుగుతుండడంతో వితంతు పింఛన్ వ్యవహారం బయటికొచ్చినట్లు తెలుస్తోంది. పింఛన్ డబ్బుల కోసం తన కొడుకుని చంపేసిందని అత్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకుని చంపేందుకు కూడా ఆమె వెనకాడదని తీవ్ర ఆరోపణలు గుప్పించింది. కనీసం వివరాలు తెలుసుకోకుండా అధికారులు పింఛన్ ఎలా ఇస్తున్నారని భర్త సుభాష్, అతని తల్లి ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Widow Finchan while her husband was away

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page