చౌడేపల్లెలో పిడుగుపడి ఐదు మేకలు మృతి

0 9,304

చౌడేపల్లె ముచ్చట్లు:

 

పిడుగుపడి ఐదు మేకలు మృతి చెందిన సంఘటన మండలంలోని పరికిదొన సమీపంలోని ఊటకుంట వద్ద శనివారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పరికిదొనకు చెందిన డి.రమణ మేకలు మేపుతూ కుటుంభాన్ని పోసిస్తున్నాడు. సమీపంలోని ఊటకుంట వద్దకు మేకలను మేపేందుకు తోలుకెళ్లాడు. వర్షం రావడంతో ఓ చెట్టు వద్దకు వెళ్లగా పిడుగుపాటుకు గురై, ఐదు మేకలు మృతి చెందాయి. రమణ పిడుగుషాక్‌తో తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. సంఘటన స్థలాన్ని సర్పంచ్‌ లక్ష్మిదేవి, వీఆర్‌వోలు మల్లీకార్జునరెడ్డి, ప్రసాద్‌లు పరిశీలించారు. సుమారు రూ.60 వేల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.బాధితున్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Five goats were killed in a lightning strike in Chaudepalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page