గ్యాధీజీ కళల గ్రామ స్వరాజ్యంను సాకారం చేద్దాం

0 9,680

– భారీ ర్యాలీ నడుమ సీఎం, మంత్రిచిత్రపటాలకు  పాలాభిషేకం

– కదం తొక్కిన గ్రామ సచివాలయ సిబ్బంది

- Advertisement -

– రాజన్నకు జోహార్లు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

మహాత్మాగ్యాధీజీ కళల గ్రామ స్వరాజ్యంను  సాకారం చేసేందుకే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రివర్యులు డాక్టర్‌  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ వ్యవస్థను రూపొందించారని ఎంపీడీఓ శంకరయ్య కొనియాడారు. శనివారం గాంధీ జయంతిను పురస్కరించుకొని, గ్రామసచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తి అయిన సంధర్భంగా ఆయా గ్రామ సచివాలయాల్లో , ప్రజాప్రతినిథులతో  గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు.అనంతరం  మండలకేంద్రంలోని అంబేద్కర్‌ కమ్యూనిటీ భవనం వద్దకు చేరుకొని గాంధీజీ, సీఎం వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల చిత్రపటాలతో,  గ్రామ సచివాలయం వారీగా  సీఎం, మంత్రికు కృతజ్ఞతలు తెలుపుతూ ఏర్పాటుచేసిన  ఫ్లెక్సీలతో మేళ తాళాల నడుమ  ర్యాలీగా బస్టాండుకు చేరుకొన్నారు.  దివంగత  మాహానేత డాక్టర్‌ వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళలుర్పించారు. అనంతరం బస్టాండులో   గాంధీజీ జీవిత చరిత్రను వివరించి, ప్రభుత్వం గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు, ప్రజాపాలనపై ఉద్యోగులు వివరించారు.   సచివాలయాలు ఏర్పాటై రెండేళ్ళు పూర్తిఅయిన సంధర్భంగా కేక్‌ను కత్తరించి గాంధీజీ, సీఎం, మంత్రి, చిత్రపటాలకు తినిపించారు.వర్షంను సైతం లెక్కచేయకుండా ర్యాలి , కార్యక్రమం నిర్వహించారు. లక్షలాది ఉద్యోగాలు కల్పించి ఆదుకొన్న ప్రభుత్వానికి రుణపడి ఉంటూ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రజాస్యేవ చేస్తామని సిబ్బంది పేర్కొన్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Let us embody the village self-government of Gadhiji arts

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page