సచివాలయ సేవలు దేశంలోనే ఆదర్శవంతం

0 9,707

– ఘనంగా బాపూజీకు నివాళులు
-థ్యాంకూ సీఎం అంటూ నినాదాలు
– అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యం

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

గ్రామస్థాయినుంచి ప్రజలు సకాలంలో సులభంగా ప్రభుత్వ సేవలను అందించడమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ దేశంలో ఆదర్శంగా నిలిచిందని జెడ్పిటీసీ సభ్యులు దామోదరరాజు, ఎంపీపీ రామమూర్తిలు కొనియాడారు. శనివారం గాంధి జయంతి ను పుసర్కరించుకొని చౌడేపల్లె, చారాల, దుర్గసముద్రం గ్రామ సచివాలయాల్లో పాల్గొని మహాత్మునికి ఘన నివాళులర్పించారు.గ్రామ సచివాలయ వ్యసస్థ ఏర్పాటై రెండేళ్లు కావడంతో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు కుశుభాకాంక్షలు తెలిపారు.. ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికు థ్యాంకూ సీఎం, థ్యాంకూ మినిస్టర్‌ అంటూ నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ ప్రజలకు అవినీతి రహిత పాలన అందించడమే ధ్యేయంగా సిబ్బంది పనిచేయడం అభినందనీయమని కొనియాడారు. ఇండ్ల వద్దకే ప్రభుత్వ పథకాలను అందజేస్తూ ప్రజలకు ప్రభుత్వం పట్ల విశ్వాసం కల్పించేలా కృషిచేయాలన్నారు. అనంతరం మానవహారంతో చప్పట్లు , జేజేలు పలుకుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు వరుణ్‌భరత్‌, సరస్వతమ్మ,విజయకుమారి,ఎంపీటీసీ రూపారేఖ, మునెమ్మ, నాగరత్న తదితరులున్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Secretariat services are ideal in the country

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page