ఒకేసారి 200 మంది నామినేషన్లు

0 7,879

కరీంనగర్ ముచ్చట్లు:

హుజురాబాద్ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ హీట్ రేపుతోంది. అధికార, విపక్ష పార్టీలతో పాటు వివిధ విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు సైతం నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ 200 మంది నిరుద్యోగులతో నామినేషన్లు వేయించేందుకు వైఎస్సార్‌టీవీ సన్నాహాలు చేస్తుండగా, తమ ఉద్యోగాలకు ఎసరుపెట్టేలా అసెంబ్లీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఉపాధిహామీ ఫథకం క్షేత్ర సహాయకులు 1000 మంది నామినేషన్లు దాఖలు చేస్తామని ప్రకటించారు.ఈ నేపథ్యంలోనే తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో తాత్సారం ప్రదర్శిస్తున్న ప్రభుత్వ విధానాలకు నిరసనగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో 200 మంది నామినేషన్ దాఖలు చేయనున్నట్లు టీఎస్ 61 ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. 11వ పీఆర్సీ అమలులో సర్వీసు, ఆర్థిక పరమైన అంశాలలో జరిగిన అన్యాయానికి నిరసనగానే నామినేషన్లు వేయడానికి నిర్ణయించుకున్నామని ఆ సంఘం అధ్యక్షుడు డాక్టర్ లింగయ్య తెలిపారు.పీఆర్సీలో తమకు జరిగిన అన్యాయంపై సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌‌ని కలిసినా ఎలాంటి స్పందన లేదని లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్ళు సర్వీసు పూర్తి చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు ఫుల్ ఫెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు ప్రభుత్వానికి తెలియజెప్పాలన్న ఉద్దేశంతోనే తాము 200 నామినేషన్ల దాఖలు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:200 nominations at once

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page