కార్పొరేట్,ప్రవేట్ విద్యాసంస్థల ఫీజులు దంద  పై  చర్యలు తీసుకోవాలి

0 8,580

-డిఎస్ఎఫ్ వినతి

 

ఎమ్మిగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

పట్టణంలో ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల ఫీజు దందాను అరికట్టాలని డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్(డిఎస్ఎఫ్) తాలూకా అధ్యక్ష కార్యదర్శులు నరసింహ కిరణ్ డిమాండ్ చేశారు సోమవారం స్థానిక ఎంఆర్సి కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  తీసుకొచ్చిన జీవోలను, ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి కార్పొరేటు ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎటువంటి మౌలిక వసతులు కల్పించకుండా కొన్ని పాఠశాలలు రేకుల షెడ్ లో తర్వాత నిర్వహిస్తున్నారు అటువంటి పాఠశాల ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు ధనార్జనే ధ్యేయంగా పాఠ్య పుస్తకాల పేరుతో అంగడి దుకాణం అమ్ముతూ విద్యార్థులను వేధిస్తూ, ఫీజుల పేరుతో తల్లిదండ్రులు వేధిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కావున ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు వాటి పైన దృష్టి పెట్టి చర్యలు తీసుకుని సీజ్ చేయాలని క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పాఠశాలల ముందు ప్రత్యక్ష ఉద్యమాలకు శ్రీకారం చూడతమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ పట్టణ నాయకులు బీమ, నవీన్,లోకేష్,విరేష్, శేకర్  తదితరులు పాల్గోన్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Action should be taken against the fees of corporate and private educational institutions

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page