రణరంగంగా లఖిన్ పూర్

0 8,791

రైతులకు 45 లక్షలు సాయం

లక్నో  ముచ్చట్లు:

- Advertisement -

ఉత్తరప్రదేశ్‌ లోని లఖీంపూర్‌ ఖేరీలో ఉద్రిక్తతను తగ్గించడానికి యోగి సర్కార్‌ నష్టనివారణ చర్యలు చేపట్టింది. రైతులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సక్సెసయ్యాయి. చనిపోయిన రైతుల కుటుంబాలకు 45 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. గాయపడ్డవాళ్లకు 10 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. రైతుల సంఘాలు మాత్రం ఘటనకు కారణమైన కేంద్రమంత్రి అజయ్‌మిశ్రాను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.కాగా, ఇవాళ యూపీ లఖీంపూర్‌ ఖేరీలో హై టెన్షన్‌ నెలకొంది. నిన్న రైతుల ఆందోళనల్లో జరిగిన హింసాత్మక ఘటనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి.

 

ఈ ఘటనపై ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న విపక్ష సభ్యులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. బారికేడ్లు, వాహనాలను అడ్డుగా పెట్టి భారీగా బలగాలను మోహరించారు. లఖీంపూర్‌ఖేరీలో 144 సెక్షన్‌ విధించారు. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. లఖీంపూర్‌ ఘటనతో ఢిల్లీలోనూ ఆంక్షలు విధించారు. సింఘు, ఘాజీపూర్‌ సరిహద్దులను మూసివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.ఇక ఇటు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణమేర్పడింది. లఖీంపూర్‌ఖేరీకి వెళ్తుండగా అఖిలేష్‌ను ఇంటివద్దే అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ టెన్షన్‌ టెన్షన్‌ నెలకొంది. పోలీసుల తీరుకు నిరసనగా పెద్ద సంఖ్యలో సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. పోలీస్‌ వాహనానికి నిప్పు పెట్టారు. మరోవైపు కేంద్రమంత్రి రాజీనామా చేయాలని .. మృతుల కుటుంబాలకు 2కోట్ల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు అఖిలేష్‌ యాదవ్‌.మరోవైపు లఖింపూర్ ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతులపై కారు నడిపారన్న ఆరోపణలపై కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై హత్య కేసు నమోదైంది. ఆశిష్‌ మిశ్రా సహా 14మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. లఖీంపూర్‌ఖేరీలో రైతులకు మద్దతుగా వెళ్లిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో ఆమెకు భరోసాగా రాహుల్‌గాంధీ ఓ ట్వీట్‌ పెట్టారు. నీ ధైర్యం ముందు వాళ్లంతా వెనక్కి తగ్గారు. పోరాడుతున్న రైతులను మనం గెలిపిద్దామంటూ ట్వీట్‌ చేశారు.కాంగ్రెస్‌ నేత ప్రియాంకాగాంధీ స్టేషన్‌లో చీపురు పట్టారు. రాత్రి లఖీంపూర్‌ఖేరీ వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాత్రి నుంచి సీతాపూర్‌ స్టేషన్‌లో ఉన్న ప్రియాంక చీపురు పట్టి తాను ఉన్న గదిని తనే క్లీన్‌ చేసుకున్నారు. యూపీ లఖీంపూర్‌ ఘటనతో అక్కడికి వెళ్లేందుకు అనుమతివ్వలేదు పోలీసులు. ప్రియాంకాగాంధీని అడుగడుగునా అడ్డుకున్నారు. అయితే తాను బాధిత కుటుంబాలను ఓదార్చడానికి మాత్రమే వెళ్తున్నానని..ఇదేమీ నేరం కాదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు ప్రియాంక.అంతకు ముందు.. ఉత్తరప్రదేశ్‌లో లఖీంపూర్ ఖేరీని సందర్శించడానికి గృహ నిర్బంధాన్ని దాటుకోని వెళ్తున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని పోలీసులు అరెస్టు చేశారు.

 

హరగావ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. లక్నోలోని తన ఇంటినుంచి ప్రియాంక లఖింపూర్ ఖేరీకి తెల్లవారుజామున బయలు దేరారు. ఈ క్రమంలో పోలీసులు ప్రియాంక గాంధీని అడుగడుగునా అడ్డుకున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పర్యటనకు అనుమతి లేదని పోలీసుల వెల్లడించారు. దీంతో ప్రియాంక గాంధీ బాధితులను కలిసేందుకు కాలినడకన బయలుదేరగా.. లఖింపూర్ ఖేరికి వెళ్లే మార్గంలో హరగావ్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.తాను ఇంటి నుంచి బయటకు రావడం నేరం కాదంటూ ప్రియాంక ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధితులను కలిసి వారి బాధను పంచుకోవాలనుకుంటున్నానని ప్రియాంక వెల్లడించారు. తాను ఏదైనా తప్పు చేసి ఉంటే ఆర్డర్ చూపించి కారు ఆపాలంటూ ప్రియాంక కోరారు. తాను బాధిత కుటుంబాలను ఓదార్చడానికి వెళ్తున్నానని, ఇదేమీ నేరం కాదంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దేశం రైతులదని, బీజేపీది కాదంటూ ప్రియాంక ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా.. ప్రియాంక గాంధీ లఖింపూర్ సందర్శించేందుకు ఆదివారం లక్నో విమానాశ్రయానికి చేరుకుని నేరుగా లక్నోలోని ఆమె నివాసమైన కౌల్ హౌస్‌కు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అడ్డుకుని గృహ నిర్బంధంలో ఉంచగా.. ఆమె అక్కడినుంచి తెల్లవారుజామున లఖింపూర్‌కు బయలు దేరారు. క్నో టు లఖీంపూర్‌.. టోటల్‌గా యూపీలో హైటెన్షన్‌. కేంద్రమంత్రి కొడుకు రైతులను కారుతో ఢీకొట్టి చంపాడన్న కేసుతో ఉత్తరప్రదేశ్‌ అట్టుడికిపోతోంది. తాజాగా.. సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేష్ యాదవ్ ఇంటిదగ్గర కారును దగ్దం చేశారు ఆందోళన కారులు.యూపీ లఖీంపూర్‌ ఖేరీలో హై టెన్షన్‌ నెలకొంది.

 

నిన్న రైతుల ఆందోళనల్లో జరిగిన హింసాత్మక ఘటనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఖీంపూర్‌ఖేరీకి వెళ్లనున్నారు విపక్ష సభ్యులు. దీంతో లఖీంపూర్‌ఖేరీలో 144 సెక్షన్‌ విధించారు. లఖీంపూర్‌ ఘటన నేపథ్యంలో ఢిల్లీలో కూడా ఆంక్షలు విధించారు. సింఘు, ఘాజీ బోర్డర్లను పూర్తిగా మూసివేశారు.ప్రియాంకగాధీ, అఖిలేష్‌ యాదవ్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం సహా పలువురు నేతలు లఖింపూర్‌ఖేరీకి వెళ్లి రైతులను పరామర్శించనున్నారు. ఐతే నేతలెవరూ రాకుండా నిషేధాజ్ఞలు విధించారు పోలీసులు. బారికేడ్లు, వాహనాలను అడ్డంగా పెట్టి భారీగా బలగాలను మోహరించారు. లఖీంపూర్‌ఖేరీకి వెళ్తుంగా ప్రియాంకగాంధీని అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు అఖిలేష్‌ యాదవ్‌ను అడ్డుకోవడంతో ఆయన ధర్నాకు దిగారు.సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ధర్నా హింసాత్మకంగా మారింది. కేంద్రమంత్రి కాన్వాయ్‌ రైతులపైకి దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మృతి చెందారు. దీంతో ఆగ్రహంతో పలు వాహనాలకు నిప్పు పెట్టారు అన్నదాతలు. ఐతే కాన్వాయ్‌లో తన కుమారుడు లేడంటున్నారు మిశ్రా. రైతుల దాడిలో కాన్వాయ్‌ బోల్తా పడిందని అంటున్నా..

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Battlefield Lakhinpur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page