క్యాట్ ఫిష్ స్వాధీనం

0 8,593

కామారెడ్డి ముచ్చట్లు:

కామారెడ్డి  జిల్లా సలాబాత్ పూర్ ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద నాలుగు టన్నుల నిషేధిత క్యాట్ ఫిష్ ను అధికారులు పట్టుకొని పాతి పెట్టారు.క్యాట్ ఫిష్ ను తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలాబాత్ పూర్ ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద నిషేధిత క్యాట్ ఫిష్ లను అధికారులు పట్టుకొన్నారు.ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు నుండి ఉత్తరా ప్రదేశ్ లోని అలహాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న 4 టన్నుల క్యాట్ ఫిష్ లను పట్టుకొన్నారు .వాటి విలువ సుమారు 2.5 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.జిల్లా మత్స శాఖ,రెవెన్యూ, వ్యవసాయ శాఖ,పోలీసుల ఆధ్వర్యంలో విచారణ చేపట్టి అధికారుల సమక్షంలో నిషేధిత క్యాట్ ఫిష్ లను చంపి వేసి భూమిలో పాతి పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.క్యాట్ ఫిష్ అక్రమ రవాణా చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Catfish captured

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page