అదిలాబాద్ ను వదలని డెంగీ

0 8,788

అదిలాబాద్ ముచ్చట్లు:

ఆదిలాబాద్ జిల్లాను డెంగీ భూతం వెంటాడుతోంది. మారుమూల పల్లెలే కాకుండా పట్టణ ప్రాంతాల్లో సైతం డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల డెంగీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో సైతం డెంగీ కేసులు పెరుగుతున్నట్లు సమాచారం. అయితే స్థానికంగా డెంగీ నివారణకు వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో రోగులను వైద్యులు హైదరాబాద్ నగరానికి రిఫర్ చేస్తున్నా రు. ఆయా జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో పేట్‌లెట్ల యంత్రాలు ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా వినియోగించకపోతుండడంతో రెఫరల్ సమ స్య ఉత్పన్నం అవుతోంది. డెంగీ జ్వరాల బారిన పడిన వారి రక్తం లో ప్లేట్‌లెట్‌లు గణనీయంగా తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ ప్లేట్‌లెట్‌ల కోసం కార్పొరేట్ ఆసుపత్రులు అడ్డగోలు దోపిడీతో వైద్యం చేస్తున్నారు. కాగా వాతావరణంలోని మార్పులు, పారిశుద్ధ్య లోపం వ్యక్తిగత అపరిశుభ్రత, పరిసరాల అపరిశుభ్రత లాంటి కారణాలతో పాటు అవగాహనా రాహిత్యం, వైద్య శాఖ నిర్లక్షంతో డెంగీ జ్వరాలు గత కొద్ది రోజుల నుండి విస్తరిస్తున్నాయి. డెంగీ జ్వరాల పాజిటివ్ కేసులను వైద్య శాఖ తొక్కిపెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.పాజిటివ్ కేసుల వివరాలను బయటకు వెల్లడి కాకుండా చూస్తున్నారన్నా విమర్శలున్నాయి. జిల్లా వ్యాప్తంగా పరిస్థితి రోజురోజుకు తీవ్రమవుతోంది. అయినప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటి వరకు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి అవగాహన కార్యక్రమాలు గానీ వైద్య శిబిరాలు గానీ నిర్వహించకపోవడం ఆ శాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇదిలా ఉండగా జిల్లాలోని వ్యాధులను ఆరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన ఓ వైద్యాధికారి సైతం డెంగీ బారిన పడటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి తొడసం చందు గత నాలుగు నెలల క్రితం డెంగీ వ్యాధికి గురై ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అలాగే హైదరాబాద్‌కే కాకుండా మహారాష్ట్రలోని నాగ్‌పూర్, యవత్‌మల్ లాంటి పట్టణాలకు సైతం డెంగీ కేసులు రిఫర్ అవుతున్నాయి. ఇప్పటికైన వైద్య ఆరోగ్య శాఖ యుద్ధప్రతిపాదికన స్పందించి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడామే కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Dengue not to leave Adilabad

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page