శాసన మండలిలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు

0 8,562

హైదరాబాద్   ముచ్చట్లు:

శాసన మండలిలో  సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి   చెక్ డ్యాంల నిర్మాణం వల్ల సాగు భూమివిస్తీర్ణం, భూగర్భ జలాలు పెరిగాయా.. అన్న ప్రశ్న వేశారు. దీనికి  ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమాధానమిస్తూ తెలంగాణ ప్రాంతంలో వలసలకు, ఆత్మహత్యలకు, ఆకలి చావులకు కారణం గత ప్రభుత్వాలు సాగు నీటి రంగంపై చూపిన నిర్లక్ష్యమే కారణం.  అందుకే కేసీఆర్ గోదావరి, కృష్ణా నదుల్లో నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ఒడిసి పట్టాలన్నిది సీఎం   ఉద్దేశం. గోదావరి, కృష్ణా నదిలో కేటాయించిన నీటిని పూర్తిగా వందకు వంద శాతం వినియోగించుకోవాలన్నది  సీఎం  ఆలోచన. కృష్ణా నదిలో తాత్కాలిక కేటాయింపులు జరిపారు. మనకు తక్కువ కేటాయింపులు జరిగాయి. దీనిపై ట్రిబ్యునల్ లో కొ ట్లాడి మన వాటా తెచ్చుకుంటాం.  గోదావరి నదిలో మన హక్కుగా ఉన్న  968   టీఎంసీలు, కృష్ణా నదిలో తాత్కాలిక కేటాయించిన  298 టీఎంసీల నీటిని పూర్తిగా వినియోగించకోవాలి సీఎం గారు త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.  ఈ వ్యూహంలో భాగంగా  భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు,  చిన్న నీటి తరహా ప్రాజెక్టులు, వాగులు, వంకలపై చెక్ డ్యాంల నిర్మాణం చేపడుతున్నాం.  ఇందులో భాగంగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కాళేశ్వరం వంటి మెగాప్రాజెక్టును రికార్డు స్థాయిలో పూర్తి నీటిని వినియోగించుకోవడం. వర్షాకాలంలో నీటిని స్టోర్ చేయడం కోసం ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేసి  రిజర్వాయర్లను నిర్మించి వాటిలో నీటిని స్టోర్ చేసి  ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.  ఇటీవలే  58 టీీఎంసీల భారీ రిజర్వాయర్ మల్లన్న సాగర్ ను పూర్తి చేసుకున్నాం. మిషన్ కాకతీయ వల్ల రాష్ట్రంలో చెరువులన్నీ పూడిక తీసి పునరుద్ధరించామని అన్నారు.
ఓనాడు వర్షాలు పడితే చెరువులు కొట్టుకుని పోయి వరదలువచ్చేవి. కాని భారీ వర్షాలు పడ్డా ఒక్క చెరువు కట్ట తెగలేదంటే… అది మిషన్ కాకతీయ ఫలితం. ప్రతీ మేజర్ నదులు, వాగులు,వంకలపైన చెక్ డ్యాంలు కట్టి నీటిని నిల్వ చేయాలన్నది సీఎం   ఆలోచన.   బావులలో, నీరు ఒనాడు 400 వందల ఫీట్లువేసినా నీరు వచ్చేది కాదు. కాని నేడు నీరు ఉబికి పైకి వస్తోందంటే అది సీఎం ముందు చూపుకు నిదర్శనం. చెక్ డ్యాంల నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. వీటి వల్ల చాలా లాభాలున్నాయి. మన ప్రాంతంలో నీరు నిలువ ఉండేది కాదు. వేసవి వస్తే భూగర్భజలాలు అడుగంటిపోయేవి. 35 లక్షల బావులు, బోరు బావులున్నాయి. 50 లక్షల ఎకరాలు తెలంగాణలో బోరు బావులు, బావులు మీద విద్యుత్ మీద ఆధార పడి పంటలు పండించేవారు. నీరు ఇంకినా….విద్యుత్ కోతలవల్ల రైతులు యాతన పడేవారు.  ఈ మధ్య వచ్చిన నివేదిక పరిశీలిస్తే తెలంగాణలో 3.09 మీటర్ల మేరకు భూగర్బ జలాల మట్టం పెరిగింది.   రాజన్న సిరిసిల్లా జిల్లాలో అత్యధికంగా 6.03 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి.  చెక్ డ్యాంలు చెరువుల సిల్ట్ ను అడ్డుకునేలా ఉన్నాయి. పాడి పశువులకు నీరు అందుబాటులో ఉంటుంది.  మహబూబ్ నగర్ జిల్లాలో గొల్ల కురుమలు తమ గొర్రెల కు నీరు తాగించేందుకు పక్క జిల్లాల వరకు నడిచివెళ్లేవారు. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా కూడా నీటి సమస్య లేకుండా అయింది. చెక్ డ్యాంలు  అడవులు పెరగడానికి,  మత్స్య కారులకు  ఉపయోగపడతాయి. మట్టి సంరక్షణ జరుగుతుంది. గాలిలో తేమ శాతం పెరుగుతుంది.  ఇంతకుముందు ఆయిల్ పామ్ పంటకు తెలంగాణ అనుకూలం కాదు. కాని నేడుఈ ప్రాజెక్టుల పూర్తి, చెక్  డ్యాంల నిర్మాణం, రిజర్వాయర్ వల్ల గాలిలో తేమ పెరిగి  ఆయిల్  పామ్ పంటకు అనుకూలంగా మారింది.  చెక్ డ్యాంలు తెగిపోయాయని సభ్యులు చెప్పారు. వాటిని పునరుద్ధరిస్తాం. నార్మల్ ఫ్లడ్ కు డిజైన్ చేశాం. పెద్ద స్థాయిలో వరద రావడం వల్ల తెగిపోయాయి. వాటిని ప రిశీలించి పునరుద్ధరిస్తాం. కొత్త చెక్ డ్యాంలు కడతారా అని అడిగారు. ఇది నిరంతర ప్రక్రియ. చెక్ డ్యాంల నిర్మాణం కొనసాగిస్తాం.  ఫీడర్ల చానళ్ల మరమ్మతులు 70 ఏళ్లుగా ఎవరూ చేయని రీతిలో సీఎం గారు.. ఆర్థిక అధికారాలు డిప్యూటీ ఈఈ నుండి  ఈ ఎన్ సీ వరకు ఇచ్చారు. ఇలా  ఎవరూ గతంలో నిర్ణయం తీసుకోలేదు. గతంలో చిన్న పనికి ప్రభుత్వం వద్దకు ఫైలు వ చ్చి  నిర్ణయం తీసుకునేవారు. దీనివల్ల జరాగాల్సిన అనర్థాలు జరిగేవి.  ఒక్కో అధికారి  ఒక్కో స్థాయివరకు మరమ్మతు పనులు చేపట్టేలా సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల పనులు వేగంగా జరుగుతాయి. కొన్ని చిన్న చిన్న పనులు ఎన్ ఆర్ జి. ఈ ఎస్  ద్వారా చేయవచ్చు. కాలువుల్లో సిల్ట్ ను తొలగించే పనులు చేపడుతున్నాం.  ఆయా ప్రాంత రైతుల అవసరాలకు అనుగుణంగా తూములను మూయడం, తీయడం జరుగుతుంది.  కొత్తగా కడుతున్న చెక్ డ్యాంల ద్వారా 3 లక్షల 50 వేల  ఎకరాలకు నీరు అందిస్తున్నాం. చెక్ డ్యాం, చెరువుల పునరుద్ధరణ వల్ల పంట కోసే వరకు నీటి లభ్యత ఉండటం, భూగర్భజలాలు పెరగడం వల్ల పంట బాగా పండుతుందని అన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Finance Minister Harish Rao in the Legislative Council

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page