గంగమ్మ తల్లి దీవెనలకోసం

0 8,616

– కిటకిటలాడిన బోయకొండ

– ప్రత్యేక అలంకారంలో అమ్మవారు

 

- Advertisement -

చౌడేపల్లె ముచ్చట్లు:

బోయకొండ గంగమ్మతల్లి దీవెనలకోసం భక్తులు బోయకొండ కు   ఆదివారం  అధిక సంఖ్యలో తరలివచ్చారు.  శెలవుదినం కావడంతోపాటు   వివిధ ప్రాంతాలనుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.  గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ   గణనీయంగా పెరగడంతో క్యూలైన్లు అన్నీ క్రిక్కిరిసిపోయాయి. బోయకొండలో ఎటుచూసినా జన సంధ్రంగామారింది.ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలనుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధవాహనాల్లో తరలివచ్చారు.  అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలతో  అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లులో భక్తులు   మాస్కులతో పాటు కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ కోరిన కోర్కెలు తీరిన  భక్తులు  ౖపిండి,నూనెదీపాలు, దీవెలతో మేళతాళాల నడుమ అమ్మవారికి  ప్రత్యేక  పూజలు చేసి వెహోక్కులు చెల్లించారు. అమ్మవారిని  ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌ నారాయణ, పాలకమండళి సభ్యులు జె.వెంకటరమణారెడ్డిలు దర్శించుకొన్నారు. అభివృద్దిపనులను పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. ఆయన  వెంట  ఈఓ చంద్రమౌళి, సోమల మల్లికార్జునరెడ్డి, నవీన్‌రెడ్డి, సురేంద్ర తదితరులున్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: For the blessings of Gangama mother

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page