వరుస రక్తదాన శిబిరాలకు శ్రీకారం చుట్టిన హెల్పింగ్ మైండ్స్.

0 8,583

-పుంగనూరులో రక్తదాన శిబిరం

 

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

రక్తదానం ఆవశ్యకత, రక్త వర్గీకరణ పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు హెల్పింగ్ మైండ్స్‌ బృందం విస్తృత స్థాయిలో ప్రచారం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది అని హెల్పింగ్ మైండ్స్‌ వ్వవస్దాపకులు అబుబకర్ సిద్దిక్ తెలిపారు. ‌ఆదివారం జాతీయ రక్తదాన దినోత్సవ వారోత్సవాలలో భాగంగా పుంగనూరులో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరం లో 30 మంది స్వచ్చందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అబుబకర్ సిద్దిక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ రక్తదానంపై అపోహలు ఉన్నాయని, చాలా మందికి‌ తాము ఏ గ్రూపు రక్తం కలిగి వున్నామో తెలియదని వివరించారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో రక్తదానంపై అవగాహన కల్పిస్తూ రక్త వర్గీకరణ చేస్తామని తెలిపారు. అక్టోబర్ 1 వ తేది నుంచి 10 వ తేది వరకు మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాలలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డా. కిరణ్ మాట్లాడుతూ 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని తద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడవచ్చు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ బి.కొత్తకోట ఇంచార్జి ప్రకాష్,సంస్థ సభ్యులు గురు ప్రసాద్,షబ్బీర్, త్రిగుణ,బాలాజీ, నూరు,లోకేష్,విహసిని,అజిమ్, ఇమ్రాన్,ఇలియాజ్,నాగేంద్ర,మదనపల్లి జిల్లా ఆసుపత్రి రక్తనిధి కేంద్రం మెడికల్ ఆఫీసర్ డా.లక్ష్మీ ప్రసాద్ & రక్తనిధి సిబ్బంది పాల్గొన్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Helping Minds wrapped up in a series of blood donation camps.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page