టిటిడి పాఠ‌శాల‌లకు ఐఎస్ఓ స‌ర్టిఫికెట్‌

0 9,698

– ఈవో చేతుల‌మీదుగా ప్ర‌ధానోపాధ్యాయుల‌కు అందించిన ఐఎస్ఓ బృందం

 

తిరుప‌తి ముచ్చట్లు:

 

- Advertisement -

టిటిడి నిర్వ‌హ‌ణ‌లోని ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌, శ్రీ ప‌ద్మావ‌తి ఉన్న‌త పాఠ‌శాల‌, శ్రీ గోవింద‌రాజ స్వామి ఉన్న‌త పాఠ‌శాల‌, శ్రీ కోదండ‌రామ‌స్వామి ఉన్న‌త పాఠ‌శాల‌, ఎస్వీ ఒరియంట‌ల్ ఉన్న‌త పాఠ‌శాల‌, ఎస్వీ బ‌ధిర పాఠ‌శాల‌, ఎస్వీ సంగీత‌, నృత్య పాఠ‌శాల‌, ఎస్వీ నాద‌స్వ‌రం పాఠ‌శాల‌, తాటితోపులోని శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామి ఉన్న‌త పాఠ‌శాల‌, తిరుమ‌ల‌లోని ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌కు ఐఎస్ఓ స‌ర్టిఫికెట్ల‌ను సోమ‌వారం ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి చాంబ‌ర్‌లో ఆయ‌న చేతుల మీదుగా క‌మిటీ స‌భ్యులు ఆయా పాఠ‌శాల‌ల ప్ర‌ధానోపాధ్యాయుల‌కు అందించారు.టిటిడి పాఠ‌శాల‌లో డాక్యుమెంట్ల నిర్వ‌హ‌ణ‌, ఉత్త‌మ మౌళిక స‌దుపాయాలు, విద్యార్థుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌, ఆహార పంపిణీ, ఆపరేటింగ్ విధానం(ఎస్ఓపి), ఉత్త‌మ విద్యా ప్ర‌మాణాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఐఎస్ఓ-9001 స‌ర్టిఫికెట్ల‌ను అందించారు.

 

 

టిటిడి పాఠ‌శాల‌ల్లో భౌతిక దూరం, శుభ్ర‌త, పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌, కోవిడ్ – 19 నిబంధ‌న‌ల బాగా పాటించినందుకు గుడ్‌ హైజెనిక్ ప్రాక్టీస్ (జిహెచ్‌పి) స‌ర్టిఫికెట్ల‌ను అందించారు.టిటిడి పాఠ‌శాల్లో చ‌క్క‌టి విద్యా ప్ర‌మాణాలు, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ, రికార్డుల నిర్వ‌హ‌ణ చేస్తున్న టిటిడి ఉన్న‌త పాఠ‌శాల‌ల ప్ర‌ధానోపాధ్యాయులు  సంధ్య‌,   చంద్ర‌య్య‌,   సురేంద్ర‌బాబు,   గీతాంజ‌లి,   ప‌ద్మావ‌తి,   క్రిష్ణ‌మూర్తి,   జ‌మునారాణి,   ర‌మ‌ణ‌మూర్తి,   క్రిష్ణ‌మూర్తిల‌ను ఈవో ఈ సంద‌ర్భంగా అభినందించారు.జెఈవో  స‌దా భార్గ‌వి, టిటిడి విద్యా శాఖాధికారి   గోవింద‌రాజ‌న్, హెచ్‌వైఎం ఐఎస్ఓ స‌ర్టిఫికెష‌న్ ప్రైవేట్ లిమిటెడ్ యండి  ఆల‌పాటి శివ‌య్య పాల్గొన్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: ISO Certificate for TTD Schools

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page