కొత్త నినాదంతో జనసేనాని

0 8,765

విజయవాడ   ముచ్చట్లు:

జనసేన అధినేత  పవన్ కల్యాణ్ రాజకీయ నేతగా ఇంకా ఎదగలేదనే అనిపిస్తుంది. ఆయన కోపాన్ని అణుచుకోవాలని తన క్యాడర్ కు హితబోధ చేస్తూనే మరోవైపు ఆయన అధికార పార్టీపై విరుచుకు పడటం వింతగా ఉంది. రాజమండ్రి వచ్చిన పవన్ కల్యాణ్ అక్కడ రోడ్లపై ఉన్న గుంతలో ఒక తట్ట మట్టి వేశారు. ఆ తర్వాత తిట్లదండకం అందుకున్నారు. ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి నుంచి పేర్ని నాని వరకూ వదిలపెట్టకుండా తనదైన భాషలో తిట్లదండకం అందుకున్నారు.రాజమండ్రి సభలో పవన్ కల్యాణ్ కొత్త నినాదాన్ని అందుకున్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజికవర్గాలు కలసి వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదన్నారు. ముందుకు వస్తే తప్ప రాజ్యాధికారం దక్కదన్నారు. కాపులంతా ఒక్కటై అందరూ మాట్లాడుకుని ఒక మాట మీద నిలబడాలన్నారు. కాపులే రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. ఇతర కులాల వారికి అండగా నిలబడాలని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.అవకాశం అందరం ఒక్కటై తెచ్చుకోవాలని కాపు సామాజికవర్గానికి పిలుపు నిచ్చారు. కమ్మ సామాజికవర్గానికి వ్యతిరేకం కాదని చెప్పడానికే తాను ఆరోజు టీడీపీకి మద్దతిచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు. తనకు రెడ్లన్నా గౌరవం ఉందన్నారు. తనకు అన్ని కులాలు ఒక్కటేనని చెప్పారు. కాపులు అవసరమైతే తగ్గాలని, అందరికీ ఆదర్శంగా నిలవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఒక మార్పునకు కాపులు నాందిపలకాలన్నారు. ఇది తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో ముడిపడి ఉందన్నారు.శ్రమదానం కార్యక్రమానికి వచ్చిన పవన్ కల్యాణ‌్ ఈసారి కులాలన్నింటినీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కాపులంతా ఏకమయ్యేలా ఆయన దాదాపు పది నిమిషాలు ప్రసంగించడం విశేషం. కాపు సామాజికవర్గమే రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు. అందరూ కలిస్తేనే బలం అని ఆయన అనడం కాపులను ఏకం చేయడంకోసమే. మరి పవన్ కల్యాణ్ కాపులను ఏకం చేసే ప్రయత్నం రాజమండ్రి నుంచే మొదలు పెట్టారని చెప్పాలి. కులాలను రెచ్చగొట్టవద్దంటూనే కులాల ప్రస్తావన తెచ్చారు. పవన్ కల్యాణ‌ మీరు వచ్చిన పనేంటి? చేసిన గోలేంటి?

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Janasena with a new slogan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page