జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి

0 8,574

– జర్నలిస్టుల నిరసన ప్రదర్శన…
-కాకినాడ  న్యూస్ రిపోర్టర్ పై అక్రమ కేసులకు నిరసన
-ఆర్డీవోకు డీఎస్పీ కి వినతి పత్రం

 

కాకినాడ ముచ్చట్లు:

 

- Advertisement -

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా  విలేకరులు సోమవారం రామచంద్రపురం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేసి ఆర్డీవో కుమారి సింధు సుబ్రహ్మణ్యం కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా  జర్నలిస్టులు మాట్లాడుతూ కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విలేకరులపై మాట్లాడిన వ్యాఖ్యలను, పెట్టిన అక్రమ కేసును ఖండించారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి నిరంతరం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళుతూ ప్రజాసమస్యల పరిష్కారం నిమిత్తం రాత్రనక పగలనకా కష్టపడుతూ సమాచార సేకరణలో ప్రాణాలకు తెగించి కష్టపడుతున్న జర్నలిస్టులపై ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు దాడులు పెరిగిపోయాయని వాటిని తక్షణమే అరికట్టి జర్నలిస్టులకు రక్షణ కల్పించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు.  తక్షణమే జర్నలిస్టులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.   ఆర్ డి ఓకు వినతి పత్రం అందజేశారు. అనంతరం రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి కివినతిపత్రం సమర్పించారు .

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Journalists should be protected

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page