కొండామూవీపోస్టర్_విడుదల..

0 7,862

సినిమాముచ్చట్లు:

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తీస్తున్న మూవీ కొండా. తెలంగాణ రాజకీయాల్లో తమ కంటూ ఓ ప్రత్యేకతను సాధించిన కొండా దంపతుల నేపథ్యం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వర్మ. ఈ మేరకు తాజాగా కొండా సినిమాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు వర్మ. 1980 లో లవ్ స్టోరీ విత్ నక్సల్స్ బ్యాగ్రౌండ్ తో కొండా మూవీ తెరకెక్కుతోంది. వర్మ రిలీజ్ చేసిన పోస్టర్ లో కొండా మురళి పాత్రను చాలా హైలెలట్ గా చూపించారు.
గాంధీ లెక్క రెండో చెంప జూపెట్ట నేను.. చంపేస్తా… అర్ధం కాలే? అంటూ భయంకరమైన చూపులతో ఉన్న హీరో పాత్ర పోస్టర్ లో కనిపిస్తోంది. మరో పోస్టర్ లో చేతిలో టీ గ్లాస్ పట్టుకుని సీరియస్ లుక్ తో కొండా మురళి పాత్ర కనిపిస్తోంది. ఇక అటు కొండా సురేఖను ఒక పోస్టర్ లో చాలా అందంగా… మరో పోస్టర్ లో విషాద వదనంలో చూపించారు వర్మ. అన్ని పోస్టర్లలోనూ నక్సల్స్ మరియు తుపాకులు సాధారణంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు.. ఈ సినిమా పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు కొండా అభిమానుల్లో.. ఓరుగల్లు పాలిట్రిక్స్ లో కొండా సినిమాపై ఉత్కంఠ నెలకొంది. కొండా సినిమాలో హీరోగా కొండా మురళి పాత్ర ఉండగా.. విలన్ గా ఎవరిని తెరకెక్కిస్తున్నారో అనేది ఆసక్తిగా మారింది.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:KondaMoviePoster_Release ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page