పుంగనూరులో 10న మంత్రి పెద్దిరెడ్డి దంపతులకు కాపులచే సన్మానం

0 9,748

-జయప్రదం చేయాలని పిలుపు

 

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

కాపు సంక్షేమానికి కృషి చేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఆయన సతీమణి స్వర్ణమ్మ దంపతులను ఈనెల 10న పట్టణంలో సన్మానిస్తున్నట్లు రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం తెలిపారు. సోమవారం ఆయన చైర్మన్‌ అలీమ్‌బాషా, ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డితో కలసి మండలం, మున్సిపాలిటిలో కాపు సంఘ నాయకులతో సమావేశం నిర్వహించారు. నాగభూషణం మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంలో కాపులు ఎంతో అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. ప్రతి కాపు కుటుంబం వైఎస్‌ఆర్‌సిపికి రుణపడి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమం రాష్ట్ర కాపు సంఘ నాయకులు , టీటీడీ బోర్డు మెంబరు పోకల అశోక్‌కుమార్‌, ముత్తంశెట్టి విశ్వనాథ్‌ హాజరౌతున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని కాపులందరు తప్పక హాజరుకావాలెనని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు సిఆర్‌.లలిత, నాగేంద్ర, కాపు సంఘ నాయకులు కనకదుర్గా సత్యనారాయణ, నానబాలగణేష్‌, ముత్యాలు, పూలత్యాగరాజు, తుంగామంజునాథ్‌, బండిబాలుతో పాటు వైఎస్‌ఆర్‌సిపి నాయకులు చంద్రారెడ్డి యాదవ్‌, చంద్రారెడ్డి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Minister Peddireddy and his wife were honored by the Kapus on the 10th in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page