బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి

0 8,763

ఖమ్మం ముచ్చట్లు:

దసరా పండుగ సంద్భంగా మహిళలు బతుకమ్మ ఆడేందుకు మహిళలకు ప్రభుత్వం చీరలు అందించడం చాలా సంతోషంగా ఉంది అని పాలేరు ఎమ్మెల్యే కందాల  ఉపేందర్ రెడ్డి అన్నారు.సోమవారం నేలకొండపల్లి మండలంలోని బొదులబండ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఆడపడుచుకి బతుకమ్మ చీరలను అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు.కరోనా కష్టకాలలో కూడా ఎక్కడ తగ్గకుండా సంక్షేమ పథకాలు కొనసాగించడం ప్రభుత్వ   దార్శనికతకు నిదర్శనమన్నారు. అనంతరం  కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కూసుమంచి,తిరుమలాయపాలెం మండలాలకు చెందిన ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్ పర్సన్ ధనలక్ష్మి,ఎంపిపి వజ్జారమ్య,బొదులబండ సర్పంచ్ అనగాని అనిత, నేలకొండపల్లి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఉన్నం బ్రమ్మయ్య, కూసుమంచి ఎంపిపి శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేకర్,అధికారులు ఎమ్మార్వో తాళ్లూరి సుమ, ఎంపీడీవో చంద్రశేఖర్, ఏ ఎస్ ఐ రాఘవయ్య , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:MLA Kandala Upender Reddy initiated the Batukamma sari distribution program

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page