40 వేల మందికి పర్మినెంట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్

0 8,570

న్యూఢిల్లీ ముచ్చట్లు:

కౌంటింగ్ అండ్ కన్సల్టింగ్‌‌‌‌ కంపెనీ  పీడబ్ల్యూసీ  తన 40 వేల మంది ఉద్యోగులకు పర్మినెంట్‌‌‌‌గా వర్క్‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌ను ఆఫర్ చేసింది. తమ యూఎస్‌‌‌‌ క్లయింట్లకు సర్వీస్‌‌‌‌ అందించేందుకు పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ఫెసిలిటీని కల్పించింది. పర్మినెంట్‌‌‌‌గా ఇంత మందికి వర్క్‌‌‌‌ ప్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌ ఫెసిలిటీని అందిస్తున్న పెద్ద కంపెనీ పీడబ్ల్యూసీనే కావడం విశేషం. డెలాయిట్‌‌‌‌, కేపీఎంజీ వంటి ఇతర అకౌంటింగ్ కంపెనీలు కూడా కరోనా నేపథ్యంలో వర్క్‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌ను ఆఫర్ చేస్తున్నాయి. క్లయింట్లకు సర్వీస్‌‌‌‌లను అందిస్తున్న ఉద్యోగులకు పర్మినెంట్‌‌‌‌గా వర్క్ ఫ్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌ అందిస్తున్న మొదటి కంపెనీ తమదేనని  పీడబ్ల్యూసీ డిప్యూటీ పీపుల్‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ యోలండా సీల్స్ కోఫీల్డ్‌‌‌‌ అన్నారు. క్లయింట్లను డైరెక్ట్‌‌‌‌గా ఫేస్‌‌‌‌ చేయని  హుమన్ రీసోర్సెస్‌‌‌‌, లీగల్ ఆపరేషన్స్‌‌‌‌ ఉద్యోగులకు ఇప్పటికే ఫుల్‌‌‌‌ టైమ్‌‌‌‌ వర్క్ ఫ్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌ విధానాన్ని ఆఫర్ చేశామని చెప్పారు. పర్మినెంట్‌‌‌‌గా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పనిచేయాలనుకునే ఉద్యోగులు గరిష్టంగా నెలకు మూడు సార్లు ఆఫీస్‌‌‌‌కు రావాల్సి ఉంటుందని అన్నారు. క్రిటికల్ టీమ్‌‌‌‌ మీటింగ్స్‌‌‌‌, క్లయింట్ విజిట్స్‌‌‌‌ వంటి వాటి కోసం ఆఫీస్‌‌‌‌కు రావాల్సి ఉంటుందన్నారు.  ‘సంక్షోభం నుంచి, వర్చువల్‌‌‌‌ వర్కింగ్ విధానం నుంచి చాలా నేర్చుకున్నాం. ఫ్లెక్సిబిలిటీకి మారడం నేచురల్‌‌‌‌గా తీసుకునే నెక్స్ట్‌‌‌‌ స్టెప్‌‌‌‌’ అని సీల్స్‌‌‌‌ కోఫీల్డ్‌‌‌‌ అన్నారు. క్లయింట్ సర్వీసెస్‌‌‌‌లో పనిచేస్తున్న ఉద్యోగి అయి ఉండి, వర్చువల్‌‌‌‌గా వర్క్ చేయాలనుకుంటే చేయొచ్చని చెప్పారు. పీడబ్ల్యూసీ ఉద్యోగుల జీతాలకు సంబంధించి లొకేషన్‌‌‌‌ను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.  వర్చువల్‌‌‌‌గా పనిచేసేందుకు రెడీ అయిన ఉద్యోగి, తక్కువ లివింగ్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ ఉన్న లొకేషన్‌‌‌‌ నుంచి  పనిచేస్తే జీతం తగ్గుతుందని చెప్పారు. గూగూల్‌‌‌‌ కూడా తమ ఉద్యోగుల జీతాలకు సంబంధించి లొకేషన్‌‌‌‌ను పరిగణనలోకి తీసుకుంటోంది. కాగా,  పర్మినెంట్‌‌‌‌గా వర్క్‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌ను ఎంచుకున్న ఉద్యోగికి తక్కువ జీతాన్ని కంపెనీలు ఇస్తున్నాయి.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Permanent work from home for 40,000 people

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page