కేసీఆర్ సభ కోసం ప్లాన్

0 7,864

కరీంనగర్ ముచ్చట్లు:

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ పాల్గొనే సభలపై సస్పెన్స్‌ నెలకొంది. కరోనా నిబంధనల ప్రకారం బహిరంగ సభలకు వెయ్యి మందినే అనుమతించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. మందిరాల్లో జరిగే సమావేశాల్లో 200 మంది వరకే అనుమతించాలని సూచించింది. కరోనా సమయంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రుల భారీ బహిరంగ సభలు ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనసాగినందున.. అదే తరహాలో సడలింపులు కోరాలని టీఆర్ఎస్ భావిస్తోంది.మరోవైపు రోడ్‌షోలు నిర్వహించాలని తొలుత భావించిన మంత్రి కేటీఆర్‌ కూడా సభలకే హాజరుకావాలని నిర్ణయించారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ పాల్గొనే సభలకు ప్రత్యేక అనుమతిని కోరతామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ తెలిపారు. హుజురాబాద్‌లో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఎన్నికల సంఘాన్ని వీలైనంత తర్వగా అనుమతి కోరతామని ఆయన తెలిపారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Plan for KCR House

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page