ల‌ఖింపూర్ ఖేరి ఘ‌ట‌న‌ను నిర‌సిస్తూ ప్రియాంక గాంధీ ఆందోళ‌న

0 9,865

–  అరెస్ట్‌ చేసి సీతాపూర్‌ గెస్ట్ హౌజ్‌లో బంధించిన  పోలీసులు
–   చీపురు అందుకుని ఆ రూమ్‌ను శుభ్రం చేసుకున్న ప్రియాంకా

 

లక్నో ముచ్చట్లు:

 

- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్‌ ఖేరీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖింపుర్ ఖేరిలో కేంద్ర మంత్రి కాన్వాయ్ రైతుల మీద నుంచి దూసుకెళ్లిన ఘ‌ట‌న‌ను నిర‌సిస్తూ కాంగ్రెస్ నేత ప్రియాంగా గాంధీ వ‌ద్రా ఆందోళ‌న చేప‌ట్టారు ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనను ప్రధాన ప్రతిపక్షాలు కుడా తీవ్రంగా ఖండించాయి. లఖీమ్‌పూర్‌ ఖేరీలో రాజకీయ నేతల ప్రవేశంపై పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. లఖీమ్‌పూర్‌ఖేరీ వెళ్లేందుకు కాంగ్రెస్‌ నేత ‍ప్రియంక గాంధీ యత్నించారు. దీంతో ఆమె పోలీసులు అరెస్ట్‌ చేశారు.సీతాపూర్‌స్థానిక గెస్ట్ హౌజ్‌లో ఆమెను బంధించారు. పీఏసీ గెస్ట్ హౌజ్‌లో ఉన్న ఆమె.. అక్క‌డ చీపురు అందుకుని ఆ రూమ్‌ను శుభ్రం చేశారు. ఆ త‌ర్వాత ఆమె నిరాహార దీక్ష చేప‌ట్టారు. గెస్ట్ హౌజ్ రూమ్ శుభ్రంగా లేద‌ని, అందుకే ఆమె ఆ రూమ్‌ను క్లీన్ చేసిన‌ట్లు కొంద‌రు తెలిపారు. ప్రియాంకా త‌న‌ను బంధించిన గ‌దిని ఊడ్చిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆమె అరెస్టును నిర‌సిస్తూ ఆందోళ‌న‌కారులు ఆ గెస్ట్ హౌజ్ ముందు ధ‌ర్నా చేప‌ట్టారు. ప్రియాంకా గాంధీ, దీపేంద‌ర్ హూడాల‌పై పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరును కాంగ్రెస్ ఖండించింది. సీతాపూర్‌లో త‌న కాన్వాయ్‌ను అడ్డుకున్న స‌మ‌యంలో ప్రియాంకా గాంధీ పోలీసుల‌పై తిర‌గ‌బ‌డ్డారు. త‌న అరెస్టు వారెంట్ చూపించాలంటూ ఆమె డిమాండ్ చేశారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Priyanka Gandhi agitates over Lakhimpur Kheri incident

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page