జపాన్ దేశ 100వ ప్రధానమంత్రిగా పుమియో కిషిడా

0 9,708

టోక్యో ముచ్చట్లు:

 

జపాన్ దేశ 100వ ప్రధానమంత్రిగా పుమియో కిషిడా అధికారికంగా ఎన్నికయ్యారు. సోమవారం జపాన్ పార్లమెంటు ఉభయ సభల్లో మెజారిటీ ఓట్లు సాధించిన మాజీ దౌత్యవేత్త పుమియో ప్రధానమంత్రి అయ్యారు. లిబరల్ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన 61 ఏళ్ల నాయకుడు యోషిహిడే సుగా ఏడాది పాలన తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. కిషిడా పార్లమెంటును రద్దు చేసి అక్టోబరు 31వతేదీన సార్వత్రిక ఎన్నికలు జరిపే అవకాశముందని భావిస్తున్నారు.జపాన్ దేశంలో కరోనా విజయవంతంగా తగ్గుముఖం పట్టాక అత్యవసర పరిస్థితిని ఎత్తివేశారు. కిషిడా తన క్యాబినెట్ ను ఏర్పాటు చేయనున్నారు.యువత, మహిళల ఆర్థిక భద్రత మెరుగుపర్చడంతోపాటు ఎక్కువమంది జనాభాకు కొవిడ్ టీకాలు వేయడంపై తాను దృష్టి పెడతానని ప్రధానమంత్రి కిషిడా చెప్పారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Pumio Kishida becomes the 100th Prime Minister of Japan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page