తెలంగాణను కేంద్రం చిన్న‌చూపు చూస్తోంది-   శాస‌న‌స‌భ‌లో మండి పడ్డ ముఖ్య‌మంత్రి కేసీఆర్

0 8,794

హైద‌రాబాద్ ముచ్చట్లు:


తెలంగాణను కేంద్రం చిన్న‌చూపు చూస్తోంద‌ని,తెలంగాణ ప‌ట్ల కేంద్ర నిర్ల‌క్ష్య వైఖ‌రిపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.టూరిజంతో పాటు ఇత‌ర విష‌యాల్లో కేంద్రం తెలంగాణ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. తెలంగాణ చాలా ఉజ్వ‌ల‌మైన సంస్కృతి, చ‌రిత్ర, సంప్ర‌దాయాలు.. గొప్ప క‌ళ‌ల‌తో కూడుకున్న ప్రాంతం. 58 సంవ‌త్స‌రాలు స‌మైక్యాంధ్ర ప్ర‌దేశ్‌లో తెలంగాణ‌ను ప‌ట్టించుకోలేదు. ప్ర‌మోట్ చేయ‌లేదు. అద్భుత‌మైన జ‌ల‌పాతాలు తెలంగాణ‌లో ఉన్నాయి. ఖ‌మ్మంలో పాండ‌వుల గుట్ట‌ను ప‌ట్టించుకోలేదు. వార‌స‌త్వంలో వ‌చ్చిన పురాత‌న కోట‌లు, దోమ‌కొండ కోట అప్ప‌గిస్తామ‌ని చెబుతున్నారు. చారిత్రాక ఉజ్వ‌ల‌మైన అవ‌శేషాలు ఉన్న తెలంగాణ ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్య వైఖ‌రితో ఉంది. తెలంగాణ‌లో క‌ళాకారులు, విశిష్ట‌మైన వ్య‌క్తులు ఉన్నారు. ప‌ద్మ‌శ్రీ అవార్డుల కోసం జాబితాను పంపాలా? వ‌ద్దా? అని ప్ర‌ధాని మోదీ, అమిత్ షాను అడిగాను.ఉమ్మ‌డి ఏపీలో అలంపూర్‌లోని జోగులాంబ టెంపుల్‌ను ప‌ట్టించుకోలేదు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఆర్డీఎస్ మీద అన్యాయాన్ని నిల‌దీసేందుకు జోగులాంబ నుంచే మొట్ట‌మొద‌టిసారిగా పాద‌యాత్ర చేప‌ట్టాను. కృష్ణా, గోదావ‌రి పుష్క‌రాల మీద కూడా ఉద్యమం చేశాను. తెలంగాణ‌లోని ప్ర‌కృతి సౌంద‌ర్యాల‌ను కాపాడుకుంటాం. మ‌గ‌ధ సామ్రాజ్యం ఎంత విశిష్టంగా, వైభ‌వంగా ఉండేనో.. మ‌న శాతావాహ‌నుల చ‌రిత్ర కూడా అంతే గొప్ప‌ది. నూత‌న ప‌రిశోధ‌కులు శాస‌నాల‌ను వెలికితీస్తున్నారు. అన్ని జిల్లాల‌కు సంబంధించిన ఎమ్మెల్యేల‌తో ఓ క‌మిటీని ఏర్పాటు చేసి చారిత్రాక‌మైన ప్ర‌దేశాలు, కోట‌లు, ద‌ర్శ‌నీయ స్థ‌లాలు, విశిష్ట‌మైన దేవాయాల ప్రాచుర్యాన్ని ప్ర‌పంచానికి తెలియ‌జేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఎయిర్ స్ట్రిప్స్ ఇవ్వాల‌ని అడిగాం. ఆరున్న‌ర సంవ‌త్స‌రాలు గ‌డిచిపోతోంది. కేంద్రం కాల‌యాప‌న చేస్తోంది అని సీఎం కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:The Center is underestimating Telangana – Chief Minister KCR who was incensed in the Legislative Assembly

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page