పార్టీలో 12 సంవత్సరాల శ్రమ ఫలితమే ఎంపీపీ పదవి

0 9,687

-వెంకటాచలం మండలం ఎంపీపీ మందా కవిత

 

నెల్లూరు ముచ్చట్లు:

 

- Advertisement -

గత 12 సంవత్సరాలుగా వైకాపా పార్టీలో తన భర్త మందకృష్ణ అందించిన సేవలకు గుర్తింపుగానే తనకు వెంకటాచలం మండల ఎంపీపీగా రాజకీయ అవకాశం లభించిందని ఎంపిపి మంద కవిత తెలిపారు. స్థానికంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి మండల మాజీ జెడ్పీటీసీ సభ్యులు మంద వెంకట శేషయ్య లతో పాటు వైకాపా కార్యకర్తగా తన భర్త మందకృష్ణ ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి కి ఎంపీపీ పదవిని కట్టబెట్టి రాజకీయ అవకాశం కల్పించిన వైకాపా నాయకులకు కార్యకర్తలకు మండల ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి తన వంతు సేవలు అందిస్తానన్నారు. ఈ సందర్భంగా కసుమూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ కడివేటి శివ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తోనే సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోని దళిత వర్గాలకు రాజుకి అవకాశం లభించిందని ఆయన సేవలను కొనియాడారు. కసుమూరు గ్రామ పంచాయితీ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి తన వంతు నిరంతరం రాజీలేని సేవలు సేవలందించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజా అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేర్చేందుకు తన వంతు సహకారం అందిస్తామన్నారు. ప్రజలు తమ పై నమ్మకంతో అప్పగించిన పదవి బాధితులను నెరవేరుస్తూ పార్టీ బలోపేతానికి పాటు పడతామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనాపరమైన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ షేక్ బాబర్, వార్డు సభ్యులు విరుపూరు  ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: The post of MP is the result of 12 years of hard work in the party

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page