పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత-ఏజెంట్  వెంకటేశ్వర్ రెడ్డి

0 8,558

మందమర్రి ముచ్చట్లు:

పరిసరాల పరిశుభ్రత మనందరం బాధ్యతగా తీసుకోవాలని శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5, ఆర్కే 6 గ్రూప్ ఏజెంట్ వెంకటేశ్వర్ రెడ్డి,గని మేనేజర్ సంతోష్ కుమార్ లు పేర్కొన్నారు.సోమవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్ కె 6 గనిలో స్వచ్ఛ్ పక్వాడా కార్యక్రమాన్ని చేపట్టారు. గని మేనేజర్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5, ఆర్కే 6 గ్రూప్ ఏజెంట్ వెంకటేశ్వర్ రెడ్డి అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.గని ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు.  అనంతరం ఏజెంట్ వెంకటేశ్వర్ రెడ్డి,గని మేనేజర్ సంతోష్ కుమార్ లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వచ్ఛ్ పక్వాడా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పని స్థలాలు అలాగే ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత పాటిస్తూ సింరేణీయులు అందరికీ ఆదర్శం కావాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి కాదసి శ్రీనివాస్ , ఇంజినీర్లు శ్యామ్ ,మహేష్ , సర్వేయర్ వర్మ,   గుర్తింపు సంఘం ఫిట్  సెక్రెటరీ చిలుముల రాయమల్లు ,వెంకట రాజం లక్ష్మీనారాయణ  ,భూమయ్య, ముస్తాల రమేష్ , అన్వేష్ రెడ్డి , అవదేశ్,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:We are all responsible for the cleanliness of the environment – Agent Venkateshwar Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page