మీ కుటుంబానికే 100 శాతం ఉద్యోగాలు : షర్మిల

0 7,578

నిజామాబాద్ ముచ్చట్లు:

ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోని నిరుద్యోగులకు కేసీఆర్ తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలోని యువతకు 5 శాతం ఉద్యోగాలు.. మీ కుటుంబంలోని వారికి వంద శాతం ఉద్యోగాలా?.. కేటీఆర్ షేమ్ ఆన్ యూ.. అసెంబ్లీలో చేసిన ప్రకటనకు సిగ్గు పడాలని’ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.తెలంగాణ ప్రజలు సోమరిపోతులు కాదని.. గడీలో బతికే కేసీఆర్ సోమరిపోతని షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నాలుగైదు శాతం జనాభాకు మించి ప్రభుత్వ ఉద్యోగాలు రావని, తెలంగాణలోనే కాదు, ప్రపంచమంతా ఇలాగే ఉంటుందని రెండు రోజుల కిందట కేటీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను షర్మిల తాజాగా గుర్తుచేస్తూ విమర్శించారు. ‘మీ ఇంట్లో 100కు 100%, ఐదుగురికి ఐదు ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు.. కానీ తెలంగాణ యువతకు ఉద్యోగాలు నాలుగైదు శాతం కంటే ఎక్కువ ఇయ్యలేమని చెప్పేందుకు సిగ్గుండాలె’ దుయ్యబట్టారుతెలంగాణ యూనివర్సిటీలో 20 మంది ప్రొఫెసర్లకు గాను ఆరుగురే ఉన్నారని.. 67 శాతం పోలీసులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీ అయినా ఇదే పరిస్థితి ఉందని.. ఖాళీ యూనివర్సిటీలుగా తయారు చేశారని షర్మిల ధ్వజమెత్తారు. ‘‘ఇక్కడి వీసీ ఈ పోస్టు కోసం రూ.2 కోట్లు ఇచ్చారట.. వాటిని ఎలా సంపాదించుకోవాలా అని చూస్తున్నారు’’ అని ఆమె ఆరోపించారు.తాత్కాలిక ఉద్యోగులను నియమించి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. మొత్తం 570 ఎకరాల్లో పదో వంతు టీఆర్‌ఎస్ నాయకులు కబ్జా చేశారని షర్మిల పేర్కొన్నారు. ఇక, వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణలో ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:100 percent jobs for your family: Sharmila

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page