రజనీపై ఆరోపణలు

0 8,610

గుంటూరు ముచ్చట్లు:

గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీపై ఓ కుటుంబం సెల్ఫీ వీడియో సంచలనం రేపుతోంది. ముఖ్యమంత్రి జగన్‌ను వేడుకుంటూ యడ్లపాడు మండలం తిమ్మాపురంకు చెందిన ఓ కుటుంబం వీడియో తీసింది. మూడు నెలల క్రితం తమపై కత్తులతో దాడి చేస్తే ఎలాంటి చర్యలు లేవని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే రజనీని తాము కలిసినా కనీసం కనికరించలేదని.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
జగన్ గారంటే మాకు పిచ్చి.. ఆ ప్రేమతోనే మీ గెలుపు కోసం పనిచేశాం.. మీరిలా చేయడం న్యాయమా అమ్మా? ఇవేం రాజకీయాలు?. జగనయ్యా.. నువ్వూ నా కొడుకు లాంటోడివే, నా బిడ్డలకు తగిలిన గాయాలు చూడు.. నా కొడుకు నీతో ఫొటో తీసుకున్నాడయ్యా.. మాకు న్యాయం చేయండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమపై హత్యాయత్నం చేసినవారిని తక్షణమే అరెస్ట్ చేయాలని… సోమవారంలోగా నిందితులను అరెస్ట్ చేయకపోతే సూసైడ్‌ చేసుకుంటామని బాధిత కుటుంబం వీడియోలో తమ బాధను వ్యక్తం చేశారు. ఈ వీడియో వ్యవహారంపై ఎమ్మెల్యే స్పందించాల్సి ఉంది. అలాగే ఏ విషయంలో ఈ కుటుంబం ఆరోపణలు చేస్తుందన్నది తెలియాల్సి ఉంది.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Allegations against Rajini

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page