మరో మారు బయిటపడ్డ రాజయ్య

0 8,766

వరంగల్ ముచ్చట్లు:

మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. రెండు రోజుల కిందట బతుకమ్మ చీరలు పంచుతూ కేసీఆర్ అందరికీ భర్త కూడా అయ్యాడంటూ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా మహిళల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బతుకమ్మ చీరలు తీసుకుంటే కేసీఆర్ భర్త కావడమేంటి? ఎమ్మెల్యే సోయి ఉండే మాట్లాడుతున్నారా? అంటూ మండిపడుతున్నారు మహిళలు. కొన్నిచోట్ల నిరసనగా బతుకమ్మ చీరలను తగలబెట్టిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.అవి మరచిపోయేలోపే మరో వివాదంలో చిక్కుకున్నారు. చిలిపి పనులు చేస్తూ కెమెరాకి అడ్డంగా దొరికిపోయారు. మహిళలో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నియోజకవర్గంలో పార్టీ నేత పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య బహిరంగంగానే మహిళతో ఇబ్బందికరంగా ప్రవర్తించారు. కేక్ కట్ చేసి తినిపించిన ఎమ్మెల్యే.. మహిళ బుగ్గ గిల్లుతూ ఆమె నోట్లో వేలుపెడుతున్నట్లుగా ఉన్న వీడియో దుమారం రేపింది.ఎవరికీ అనుమానం రాకుండా మరొకరి వెనక నుంచి చేయి వేసినట్లుగా కనిపిస్తున్నప్పటికీ ఆమెని తాకుతూ చేసిన పని కెమెరా కంటికి చిక్కడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రాజయ్య రాసలీలలు అంటూ కలకలం రేపుతోంది. పుట్టిన రోజు వేడుకల వీడియో పాతదే అయినప్పటికీ.. నిన్న కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో రాజయ్య వీడియో సోషల్ మీడిలో బయటికొచ్చింది. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో డిప్యూటీ సీఎం పదవి పోగొట్టుకున్న రాజయ్య ఎమ్మెల్యే పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఆయన మరోమారు చిక్కుల్లో పడ్డారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Another alienated kingdom

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page