బీరప్ప గడ్డలో కార్డన్ అండ్ సర్చ్

0 9,669

యాదాద్రి ముచ్చట్లు:

 

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణంలోని బీరప్ప గడ్డ కాలనీలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశానుసారం యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ కె నారాయణ రెడ్డి అధ్వర్యంలో ఏసిపి ఒకరు ఆరుగురు సీఐలు ఎనిమిది మంది ఎస్ఐలు పదిమంది ఏ ఎస్ఐలు మొత్తం 200 మంది పోలీస్ సిబ్బందితో కార్డాన్ సెర్చ్ ను  నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసులు ఇళ్లను తనిఖీ చేశారు కాలనీలో బెల్ట్ షాపు లు కిరాణా షాపులో పూర్తిగా  తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో ఎలాంటి ధృవపత్రాలు లేని 43 ద్వి చక్ర వాహనాలు, ఒక ఆటో ఒక ట్రాక్టర్ 10 వేల విలువ గల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డీసీపీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ కాలనీలో బెల్ట్ షాపు లు నిర్వహించవద్దని నేర చరిత్ర కలిగిన వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని. విరంత పోలీస్ వారి సేవలను వినియోగించుకోవలని కోరారు కాలనీ వాసులు కలసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. తద్వారా కాలనీలో ప్రవేశించిన దొంగలు అపరిచిత వ్యక్తులు ఎవరు ప్రవేశించిన అమ్మాయిల ను వేధించిన తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు కాలనీలో ప్రతి ఫౌరుడు యునిపామ్ లేని పోలీసే అని. ఎలాంటి సంఘటన జరిగిన పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏసిపి ఉదయ్ రెడ్డి, సీఐ మొతిరామ్ స్థానిక ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ 200 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Cordon and search in Birappa Gadda

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page