ప్రధాన కాలువలను 173 కిలోమీటర్లుగా మదింపు

0 8,759

హైదరాబాద్ ముచ్చట్లు:

భవిష్యత్ అవసరాలు, నగరం విస్తరణను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మక నాలా అభివృద్ధిని చేపట్టాం అని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరు శివారు ప్రాంతాల్లో మంచినీటి సమస్యను ఎలా తీర్చామో… అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌ను నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అని కేటీఆర్ పేర్కొన్నారు. శాస‌న‌మండ‌లిలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు.న‌గ‌రంలో వ‌ర‌ద స‌మ‌స్య‌ను నివారించేందుకే వ్యూహాత్మ‌క నాలా అభివృద్ధి కార్య‌క్ర‌మం చేప‌ట్టామ‌ని తెలిపారు. ఇటీవల ముంపునకు గురైన ప్రాంతాలను గుర్తిస్తామ‌న్నారు. సమగ్ర విచారణ చేపట్టి… నాలా గ్రిడ్ మెరుగుదల కోసం వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాము అని కేటీఆర్ వెల్ల‌డించారు.మొత్తం ప్రధాన కాలువలను 173 కిలోమీటర్లుగా మదింపు చేసి మొదటి దశ కింద జాబితాను ఖరారు చేశాం అని కేటీఆర్ తెలిపారు. 2021లోనే వర్షాకాలం రాకముందే ఈ పనిని చేపట్టి వరదనీటి డ్రైనేజీ నెట్వర్క్లో కనీసం 30 శాతాన్ని పూర్తి చేయాలనుకున్నాం. జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించి.. కిర్లోస్కర్, వోయన్ట్స్ నివేదికలను పరిగణలోకి తీసుకుంటూ… ఎస్ఈపీఈ ఇన్ఫ్రా కన్సల్టెన్సీని సంప్రదించి.. జీహెచ్ఎంసీ జాబితాకి ప్రాధాన్యత ఇచ్చాము అని కేటీఆర్ తెలిపారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Estimation of 173 km of main canals

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page