విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం- ఏఐఎస్ఎఫ్

0 8,761

ఎమ్మిగనూరు ముచ్చట్లు:

పట్టణంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని కాబట్టి విద్యార్థులు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనదని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర సమితి సభ్యులు రంగస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి విజయేంద్ర, తాలూకా సమితి సభ్యుడు రామాంజినేయులు, తెలిపారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సమావేశానికి కళాశాల ఉపాధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ చేయకుండా విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారని, ముఖ్యంగా విద్యార్థులకు తాగునీటి సౌకర్యం, లైబ్రరీ, ల్యాబ్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికై నాడు నేడు ద్వారా నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుందని, అదే పద్ధతిలో నా ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికై నిధులు కేటాయించి వాటిని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని, సంక్షేమ హాస్టళ్లకు సన్న బియ్యం పంపిణీ చేసి విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలిని, హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇప్పటికే సంక్షేమ హాస్టల్లో అభివృద్ధికి చేయడం జరిగిందని తక్షణమే నిధులు కేటాయించి వాటిని అభివృద్ధి పరచాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం యస్ జూనియర్ కళాశాల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రవి, సురేష్, మహేష్, బాషా,రాజు, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Government fails to address academic issues – AISF

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page