అధికారుల సహకారంతో అక్రమ మైనింగ్ ను అరికడదాం-ఏడి నాగిని

0 8,790

కర్నూలు ముచ్చట్లు:

రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో సహాయ సంచాలకులు భూగర్భ గనుల శాఖలో బదిలీ చేశారని, అధికారుల ఆదేశాల మేరకు వెంటనే ఇక్కడ బాధ్యతలు స్వీకరించినట్లు ఏ.డి నాగిని తెలియజేశారు.తనకు కర్నూలు జిల్లాలో పనిచేసిన అనుభవం ఉందన్నారు.కర్నూలు జిల్లా కలెక్టర్ మరియు భూగర్భ గనుల శాఖ ఉపసంచాలకులు సహకారంతో అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట వేయాగలనని ఆత్మవిశ్వాసంతో ఆమె అన్నారు.రాయల్టీలు సక్రమంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని,ఇప్పటికే గనుల యజమానులకు తగు సూచనలను ఇచ్చినట్లు ఆమె తెలియజేశారు.మైనింగ్ సిబ్బంది సహాయ సహకారాలతో కర్నూలు పరిధిలో అక్రమ మైనింగ్ నిరోధించగలనని ఆమె తెలియజేశారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Let’s stop illegal mining with the help of the authorities – Adi Nagini

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page